బిగ్గెస్ట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ ఫుల్‌గా ఫస్ట్ వీక్‌ను కంప్లీట్ చేసుకుంది. అందరూ అనుకున్నట్లే ప్రముఖ నటి కిరణ్ రాథోడ్ బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. రాజస్థాన్‌లో పుట్టి పెరిగి పలు తెలుగు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఎలిమినేషన్‌కు ప్రధాన కారణం తెలుగు అనర్గళంగా మాట్లాడకపోవడమే. హౌజ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి కేవలం ఇంగ్లిష్‌లోనే మాట్లాడిన ఆమె బిగ్‌బాస్ హౌజ్‌లో అందరితో కలవలేకపోయింది. టాస్కుల్లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయలేకపోయింది. దీంతో హోస్ట్ నాగార్జున కూడా ఆమెను లెక్కలోకి తీసుకోలేదు. బిగ్‌బాస్‌లో కేవలం 13 మంది మాత్రమే ఉన్నారంటూ డైరెక్టుగా సెటైర్లు వేశాడు. ఇక తెలుగు రాదనే వంకతో హౌజ్‌మేట్స్ అందరూ కిరణ్‌నే నామినేట్ చేశారు. ఇక తెలుగు రాకపోవడంతో బిగ్‌బాస్ ఓటర్లు కూడా ఆమెను లైట్‌గా తీసుకున్నారు. అందరికంటే ఆమెకే తక్కువ ఓట్లు రావడం, దీనికి తోడు కొన్ని స్వయం తప్పిదాలు కూడా కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్‌కు కారణమయ్యాయి. అయితే మొదటి వారం ఎలిమినేషన్ రౌండ్ లేకపోతే కిరణ్ తన అసలు ఆట చూపించేదని, అయితే బిగ్‌బాస్ ఆ ఛాన్స్ ఇవ్వలేదని మరికొంతమంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం వారం రోజులు మాత్రమే బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్న కిరణ్ రాథోడ్ బాగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రోజుకు రూ.45వేల చొప్పున మొత్తం వారానికిగానూ రూ.3 లక్షలకు పైగానే పారితోషకం అందుకున్నట్లు తెలుస్తోంది.
కాగా తెలుగు ప్రేక్షకులకు కూడా కిరణ్ రాథోడ్ సుపరిచితమే. నువ్వులేక నేను లేను, శ్రీరామ్, నాని, అందరూ దొంగలే దొరికితే, చెప్పవే చిరుగాలి, భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా, హైస్కూల్, కెవ్వు కేక తదితర సినిమాల్లో నటించింది. ఆమె తెలుగులో చివరిగా 2016లో విడుదలైన భాజా భజంత్రీలు అనే సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు. సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు దర్శనమిస్తోంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత బిగ్‌బాష్ షోతో వార్తల్లో నిలిచింది. అయితే టాస్కుల్లో పెద్దగా యాక్టివ్‌గా లేకపోవడంతో మొదటి వారంలోనే హౌజ్ నుంచి బయటకు వచ్చింది. మరి బిగ్‌బాస్ షోతో కిరణ్‌కు ఏమైనా మళ్లీ సినిమా అవకాశాలు వస్తాయా? రావా? అన్నదో చూడాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.