Bigg Boss 7 Telugu: ‘నామినేట్ చేస్తే నమ్మకద్రోహం కాదు.. అది ప్రాసెస్ మాత్రమే’.. శోభా, అమర్ స్పీచ్‏లు..

నామినేషన్స్ తర్వాత సేఫ్ గేమ్ ఆడుతున్నావ్.. అమర్ కెప్టెన్ కాకపోవడానికి కారణం నువ్వే అంటూ శోభా అన్న మాటలు గుర్తుచేసుకుంటూ ప్రశాంత్ భోరున ఏడ్చేశాడు. అమర్ అన్న ఆటకు అడ్డంపడ్డ గౌతమ్ ను ఏం అనలేదు.. వెన్నంటే నిలబడినందుకు నన్ను నామినేట్ చేశాడు అంటూ బాధపడ్డాడు ప్రశాంత్. ఇక ఆ తర్వాత శివాజీ మాట్లాడుతూ.. నేను వెళ్లిపోవాల్సిందిరా.. ఈ టార్చర్ భరించలేకపోతున్నాను.. వాడెవడ్రా అసలు.. వాడితో నాకేం సంబంధం రా.. ప్రతి వారం కావాలనే గొడవ పడుతున్నాడు

Bigg Boss 7 Telugu: 'నామినేట్ చేస్తే నమ్మకద్రోహం కాదు.. అది ప్రాసెస్ మాత్రమే'.. శోభా, అమర్ స్పీచ్‏లు..
Bigg Boss 7 Telugu
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 29, 2023 | 7:14 AM

పదవమూడవ వారం నామినేషన్స్ ఎక్కువగా శివాజీకే పడ్డాయి. అమర్‏ను కెప్టెన్సీ రేసు నుంచి తప్పించడంతో సీరియల్ బ్యాచ్ మొత్తం శివాజీని టార్గెట్ చేశారు. ఇక తర్వాత యావర్, ప్రశాంత్ ఇద్దరినీ నామినేట్ చేశారు. మొత్తం ఈ వారం అర్జున్, గౌతమ్, ప్రియాంక, శోభా, ప్రశాంత్, యావర్, శివాజీ నామినేట్ అయ్యారు. అయితే ఈ ప్రక్రియలో అర్జున్, అమర్ కొట్టిన దెబ్బలకు అల్లాడిపోతున్నారు శివాజీ, ప్రశాంత్. నామినేషన్స్ తర్వాత సేఫ్ గేమ్ ఆడుతున్నావ్.. అమర్ కెప్టెన్ కాకపోవడానికి కారణం నువ్వే అంటూ శోభా అన్న మాటలు గుర్తుచేసుకుంటూ ప్రశాంత్ భోరున ఏడ్చేశాడు. అమర్ అన్న ఆటకు అడ్డంపడ్డ గౌతమ్ ను ఏం అనలేదు.. వెన్నంటే నిలబడినందుకు నన్ను నామినేట్ చేశాడు అంటూ బాధపడ్డాడు ప్రశాంత్. ఇక ఆ తర్వాత శివాజీ మాట్లాడుతూ.. నేను వెళ్లిపోవాల్సిందిరా.. ఈ టార్చర్ భరించలేకపోతున్నాను.. వాడెవడ్రా అసలు.. వాడితో నాకేం సంబంధం రా.. ప్రతి వారం కావాలనే గొడవ పడుతున్నాడు (గౌతమ్).. దాని వల్ల వాడికేం ప్రయోజనం ఉందో దేవుడికే తెలియాలి.. అన్యాయంగా.. అతు చెప్పేవన్నీ అబద్దాలే.. వాడ్ని నేనేం ఆపుతున్నారా ? ఆపితే ఇలా ఉంటాడా? అంటూ ఎమోషనల్ అయ్యాడు శివాజీ. నన్ను అర్జున్, నిన్ను అమర్ ఇద్దరూ నామినేట్ చేశారు. వాళ్లిద్దరి వెనక నిలబడినందుకు మనిద్దరిని నామినేట్ చేశారు. నాకేం అర్థం కావలేదు.. నన్ను ఎలిమినేట్ చేసేయండి అంటూ బాధపడ్డాడు శివాజీ.

ఇక గార్డెన్ ఏరియాలో అమర్ దీప్, శోభాశెట్టి నామినేషన్స్ గురించి ముచ్చట పెట్టారు. ఏంట్రా వీళ్లు.. ఇంతకు ముందు ఎప్పుడూ నామినేషన్ జరగనట్టు వీళ్లెప్పుడూ ఎవర్నీ నామినేట్ చేయనట్టూ మాట్లాడుతున్నారు ?.. అంటూ శోభా అనడంతో.. మరోసారి తన అతితెలివి బయటపెట్టాడు అమర్. ‘నేను ప్రశాంత్ ను నామినేట్ చేసినందుకు ఫీల్ అయిపోతున్నాడు. నేను ఆలోచించి మంచిగానే చేశాను. కానీ వాడే చెడుగా తీసుకున్నాడు. కానీ నమ్మకద్రోహం అనే పదాన్ని.. జనాలకు అమర్ దీప్ నమ్మకద్రోహం చేశాడని చూపించడానికే తీశాడు ‘ అని అన్నాడు. నామినేట్ చేస్తే నమ్మక ద్రోహం చేసినట్లు కాదు.. మోసం కూడా కాదు.. కేవలం అది ప్రాసెస్ మాత్రమే అని అన్నాడు.

యావర్, ప్రశాంత్ ఇద్దరినీ నామినేట్ చేశారని మాట్లాడటం లేదు.. ఇక్కడి వచ్చి పదమూడు వారాలు అవుతుంది.. ఏదో ఇప్పుడే కొత్తగా నామినేట్ చేసినట్లు ఫీలవుతున్నారు అంటూ తన నోటికి పనిచేప్పింది. వీళ్లకు మొన్నటి వరకు కెప్టెన్సీ బ్యా్డ్జ్ లు కావాలి. ఇప్పుడు కప్పుడు కావాలి.. మనం అడ్డం ఉండకూడదు అంటే.. మనం వెళ్లిపోయి వాళ్లకు ఇవ్వాలా ?.. ఇక మనమేందుకు మరీ అంటూ ముచ్చట పెట్టింది. మొత్తానికి తను చేసిన పని నమ్మకద్రోహం, మోసం కాదని తనకు తనే కరెక్ట్ అని అమర్.. శోభా స్పీచులు ఇచ్చారు.