Bigg Boss 7 Telugu: డేంజర్ జోన్‏లో గౌతమ్, అశ్విని.. ఎలిమినేషన్ ఉన్నట్లేనా ?..

మొన్నటివరకు ఈ వారం శోభా ఎలిమినేట్ కానుందని అనుకున్నారంతా.. అటు అశ్విని బయటకు రాబోతుందని ప్రచారం నడిచింది. అయితే చివరి క్షణంలో ఎలిమినేషన్ లేదంటూ కొత్త అప్డేట్ నెట్టింట చక్కర్లు కొట్టింది. ఈవారం ఎలిమినేషన్ తీసేశారని.. హౌస్మేట్స్ మొత్తం సేవ్ అయ్యారంటూ ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు మూడో ప్రోమోతో ఎలిమినేషన్ పై మరో డౌట్ క్రియేట్ చేశాడు బిగ్‏బాస్ . తాజాగా విడుదలైన ప్రోమో మొత్తం నామినేషన్స్. ఎలిమినేషన్ గురించి

Bigg Boss 7 Telugu: డేంజర్ జోన్‏లో గౌతమ్, అశ్విని.. ఎలిమినేషన్ ఉన్నట్లేనా ?..
Bigg Boss 7 Telugu New
Follow us

|

Updated on: Nov 19, 2023 | 7:11 PM

బిగ్‏బాస్.. ఎప్పుడు ఎలా ఆటను మారుస్తాడో అర్థం కాదు. ఉల్టా పుల్టా అంటూ ఈ సీజన్ మంచి హిట్టేయేలా చేశారు. అయితే ఎలిమినేషన్ విషయంలో మాత్రం అన్ని సీజన్స్ మాదిరిగానే సాగుతుంది. ఇప్పటికీ పది ఎలిమినేషన్స్ కాగా.. ఒకటి రెండు అటు ఇటు కాగా.. మొదటి నుంచి ఊహించినట్లుగానే ఎలిమినేషన్స్ జరిగాయి. ఇక ఇప్పుడు 11 వారం ఎలిమినేషన్ మాత్రం ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. మొన్నటివరకు ఈ వారం శోభా ఎలిమినేట్ కానుందని అనుకున్నారంతా.. అటు అశ్విని బయటకు రాబోతుందని ప్రచారం నడిచింది. అయితే చివరి క్షణంలో ఎలిమినేషన్ లేదంటూ కొత్త అప్డేట్ నెట్టింట చక్కర్లు కొట్టింది. ఈవారం ఎలిమినేషన్ తీసేశారని.. హౌస్మేట్స్ మొత్తం సేవ్ అయ్యారంటూ ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు మూడో ప్రోమోతో ఎలిమినేషన్ పై మరో డౌట్ క్రియేట్ చేశాడు బిగ్‏బాస్ . తాజాగా విడుదలైన ప్రోమో మొత్తం నామినేషన్స్. ఎలిమినేషన్ గురించి ఉండడం గమనార్హం..

మూడో ప్రోమోలో.. ముందుగా ఓ బాటిల్ తీసుకువచ్చి ప్రశాంత్ ను పగలగొట్టమన్నారు నాగ్. అందులో ఉన్న చీటీలను అందరూ తీసుకోవాలని చెప్పారు. దీంతో ప్రతి ఒక్కరు ఓ చిటీని తీసుకున్నారు. అందులో ఒక్కో చీటీలో ఒక్కొక్కరు అన్ సేఫ్ , సేఫ్ అనేది రాసి ఉంది. ముందుగా అమర్ దీప్ దగ్గరున్న చిటీ ఓపెన్ చేయగా.. రతిక అన్ సేఫ్ అని వచ్చింది. ఇక ఆ తర్వాత ప్రియాంక చేతిలో ఉన్న చిటీలో అశ్విని అన్ సేఫ్ అని వచ్చింది. ఇక తర్వాత యావర్ చేతిలో అమర్ దీప్ అన్ సేవ్ అని రాగా.. అశ్విని చేతిలో శోభా అన్ సేఫ్ అని వచ్చింది. చివరగా శోభా చేతిలో ఉన్న చిటీలో గౌతమ్ అన్ సేఫ్ అని వచ్చింది.

ఇక చివరగా అశ్విని, గౌతమ్ గార్డెన్ ఏరియాలో నిల్చోబెట్టి బాక్స్ లో చేయి పెట్టించారు. ఎవరి చేతికి రెడ్ కలర్ ఉంటుందో వాళ్లు ఎలిమినేటెడ్.. గ్రీన్ వచ్చినవాళ్లు సేఫ్ అంటూ నాగ్ చెప్పారు. ఇక వాళ్లు చేతులు తీసే సమయంలో కట్ చేసి నేను వెయిట్ చేస్తుంటా.. త్వరగా స్టేజ్ మీదకు వచ్చేయ్ అంటూ నాగార్జున చెప్పడంతో ప్రోమో ముగిసింది. అయితే శనివారం సాయంత్రం నుంచి ఈవారం నో ఎలిమినేషన్ అనే అప్డేట్ వినిపిస్తుంది. కానీ చివరి నిమిషంలో ప్రోమోతో ఎలిమినేషన్ పై హింట్ ఇచ్చేశారు. అయితే ఇప్పటివరకు వీకెండ్స్ లో వచ్చిన ఏ ప్రోమోలోనూ ఇలా చివరకు వచ్చిన కంటెస్టెంట్ గురించి రివీల్ చేయలేదు. కానీ ఈ వారం ప్రోమోలో మాత్రం గౌతమ్, అశ్విని ఇద్దరినీ చూపించి ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారంటూ చూపించారు. దీంతో ఈ వారం నో ఎలిమినేషన్ అని.. కావాలనీ ఇలా ప్రోమో వదిలారంటూ కామెంట్స్ చేస్తున్నారు అడియన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.