బిగ్బాస్ ఆరోవారం వీకెండ్ వచ్చేసింది. ఇప్పటికే ఐదుగురు అమ్మాయిలు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని, రతిక రోజ్, శుభ శ్రీ ఎలిమినేట్ కాగా.. గతవారం మరో నలుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆరో వారం అమర్ దీప్, శోభా శెట్టి, యావర్, టేస్టీ తేజా, నయని పావని, పూజా మూర్తి, అశ్విని నామినేట్ అయ్యారు. ఇందులో ప్రిన్స్ యావర్ అత్యధిక ఓటింగ్ తో టాప్ లో ఉండగా.. ఆ తర్వాత అమర్ దీప్ కు ఎక్కువగానే ఓటింగ్ వచ్చింది. అయితే ముందు నుంచి ఈవారం ఎలిమినేట్ అయ్యే కంటేస్టెంట్ ఎవరంటే ఎక్కువగా శోభా శెట్టి పేరు వినిపించింది. నెట్టింట జరిగిన అన్ని పోలింగ్స్ లోనూ శోభాకే తక్కువగా ఓట్లు వచ్చాయి. ముఖ్యంగా ఆమె బిహేవియర్ నచ్చకపోవడం.. ఇష్టామొచ్చినట్లుగా అరవడంతో.. ఆమెను వీలైనంత త్వరగా హౌస్ నుంచి పంపించేయాలంటూ కామెంట్స్ చేశారు. ఇక ఓటింగ్ ప్రకారం ఈవారం శోభా శెట్టి ఎలిమినేట్ కావడం ఖాయమనుకున్నారు. అయితే చివరి నిమిషంలో శోభా స్థానంలో కొత్త కంటెస్టెంట్ నయని పావని బలైనట్లు తెలుస్తోంది.
కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినవారిలో అర్జున్ అంబటి, పూజా మూర్తి, నయని పావని మాత్రమే సరిగ్గా ఆడుతున్నారు. అలాగే ఈ ముగ్గురు మాత్రమే నామినేషన్లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఎవరు ఊహించని రీతిలో నయని పావని ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం. వచ్చిన వారంలోనే నయని పావనిని ఎలిమినేట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే వారం రోజులకు నయని పావని ఏకంగా రూ.2.50 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ముందు నుంచి ఉల్టా పుల్టా అంటూ చెప్పుకొచ్చిన నాగ్.. మొత్తానికి ఈ సీజన్ మాత్రం మరింత ఆసక్తిగా మార్చేస్తున్నారు. అయితే శనివారం జరిగిన ఎపిసోడ్ లో ఇప్పటికే ఎలిమినేట్ అయిన రతిక, సింగర్ దామిని, శుభ శ్రీ రీఎంట్రీ ఇచ్చారు. హౌస్ లో కనీసం మూడు వారాలు ఉండి ఎలిమినేట్ అయిన ముగ్గురిలో ఒక్కరికి అవకాశం వస్తుందని.. కానీ ఆ ఛాన్స్ మాత్రం బిగ్ బాస్ డిసైడ్ చేస్తాడంటూ ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున్. మరీ ఆ ముగ్గురిలో ఎవరు తిరిగి హౌస్ లోకి రాబోతున్నారు అనేది తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.