Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: ‘అమర్ దీప్ భయపడకు.. ఆట బాగా ఆడావ్’.. నాగార్జున పొగడ్తలు.. గౌతమ్‍కు వార్నింగ్..

ప్రతి వారం తప్పులు చేసి నాగార్జునతో చివాట్లు తినే సందీప్, అమర్ దీప్ ఇద్దరికీ ఈవారం కలిసొచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా అమర్ దీప్.. తన ఆట తీరులో చాలానే మార్పులు చేసుకున్నాడు. ఇప్పుడిప్పుడే సీరియల్ బ్యాచ్ కు కొంచెం దూరంగా ఉంటూ తన ఆట తను ఆడేందుకు ట్రై చేస్తున్నాడు. ఎమోషనల్ అటాచ్మెంట్ కాకుండా సెల్ఫ్ గా ఆలోచిస్తున్నారు. ఇక ఈవారం టాస్కులలో గెలవాలని ఎక్కువగానే ప్రయత్నించాడు. ముఖ్యంగా తన మాటలను అదుపులో పెట్టుకున్నాడు.

Bigg Boss 7 Telugu: 'అమర్ దీప్ భయపడకు.. ఆట బాగా ఆడావ్'.. నాగార్జున పొగడ్తలు.. గౌతమ్‍కు వార్నింగ్..
Bigg Boss 7 Telugu
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 15, 2023 | 6:59 AM

బిగ్‏బాస్ సీజన్ 7 ఆరోవారం ఎలిమినేషన్ సమయం వచ్చేసింది. ఈసారి ఎవరు ఊహించని కంటెస్టెంట్ బయటకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక శనివారం ఎపిసోడ్‎లో నాగార్జున ఎప్పటిలాగే తప్పులు చేసిన వారికి కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. అయితే ఈవారం కొంత ఛేంజ్ కనిపించింది. ప్రతి వారం తప్పులు చేసి నాగార్జునతో చివాట్లు తినే సందీప్, అమర్ దీప్ ఇద్దరికీ ఈవారం కలిసొచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా అమర్ దీప్.. తన ఆట తీరులో చాలానే మార్పులు చేసుకున్నాడు. ఇప్పుడిప్పుడే సీరియల్ బ్యాచ్ కు కొంచెం దూరంగా ఉంటూ తన ఆట తను ఆడేందుకు ట్రై చేస్తున్నాడు. ఎమోషనల్ అటాచ్మెంట్ కాకుండా సెల్ఫ్ గా ఆలోచిస్తున్నారు. ఇక ఈవారం టాస్కులలో గెలవాలని ఎక్కువగానే ప్రయత్నించాడు. ముఖ్యంగా తన మాటలను అదుపులో పెట్టుకున్నాడు. దీంతో మొదటి సారి నాగార్జున నుంచి చివాట్లు కాకుండా పొగడ్తలు తీసుకున్నాడు.

శనివారం రావడంతోనే అమర్ దీప్ గెటప్ అంటూ నాగార్జున కాస్త సీరియస్ గా అన్నారు. దీంతో మళ్లీ ఏం చేశానంటూ అనుమానంగానే లేచి నిల్చున్నాడు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. అమర్ దీప్ ఈవారం నీ ఆట బాగా ఆడావ్.. బాగా ఇంప్రూవ్ అయ్యింది. కానీ ఇది నీలో 50 శాతం మాత్రమే. ఇంకా 100 శాతం ఇవ్వాలి అంటూ మోటివేట్ చేశారు నాగ్. ఆ తర్వాత అమర్ దీప్ భయాన్ని దూరం చేసేందుకు ట్రై చేశారు. నీ మీద నీకు ఎందుకు అంత సెల్ఫ్ డౌట్.. నేను ఎలిమినేట్ అయిపోతానేమో.. ఏదో అయిపోతుందేమో అని భయపడిపోతున్నావ్.. ముందు నువ్వు భయపడడం మానేయ్…అన్ని మర్చిపోయి ఆడు అంటూ సలహా ఇచ్చారు. ఇక ఆ తర్వాత సీక్రెట్ రూం నుంచి బయటకు వచ్చాక ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైనా డాక్టర్ బాబుకు క్లాస్ తీసుకున్నారు.

సీక్రెట్ రూం నుంచి బయటకు వచ్చిన తర్వాత గౌతమ్ బిహేవియర్ మారింది కదా అని అడగ్గా.. అశ్వద్ధామ 2.0 అంటూ హౌస్మేట్స్ ఫన్నీగా చెప్పేశారు. నువ్వు అశ్వద్ధామ అనుకుంటున్నావ్.. కానీ వాళ్లంతా అశ్వగంధ అనుకుంటున్నారంటూ డాక్టర్ బాబు గాలి తీసేశారు. అప్పుడప్పుడు ఆటలో ఏం మాట్లాడుతున్నావో తెలీయడం లేదు. బీప్ వేయాల్సి వస్తుంది. చూసుకోని మాట్లాడు అంటూ వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి ఎప్పుడూ క్లాస్ పడే సీరియల్ హీరో అమర్ దీప్ కు ఈసారి మాత్రం పొగడ్తలు వచ్చాయి. మరి ఇప్పటికైనా తన ఆట పై 100 శాతం ఎఫర్ట్స్ పెడతాడో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.