Bigg Boss 7 Telugu: శోభా కోసం నయని బలి.. వచ్చిన వారానికే బయటకు పంపించేశారా ?.. ఎలిమినేషన్ ట్విస్ట్..
సోషల్ మీడియాలో పలు పోలింగ్స్ లోనూ అతి తక్కువ ఓటింగ్ వచ్చింది కూడా ఆమెకే. ఇక బిగ్బాస్ ప్రోమోస్ కు శోభాను ఎలిమినేట్ చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారంటే ఆమె హౌస్ నుంచి బయటకు రావాలని జనాలు ఎంతగా కోరుకుంటున్నారో తెలుస్తోంది. అయితే ఈ వారం నామినేషన్స్ దగ్గర్నుంచి ప్రతి టాస్కులోనూ శోభా ప్రవర్తించిన తీరుకు ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది. తన తప్పు స ఉందని చెప్పినా.. లేదా తనను ఆట నుంచి తప్పించిన సైకోలా మారిపోతుంది. చప్పట్లు కొడుతూ.. గట్టిగా అరుస్తూ హౌస్ మొత్తం గోల గోల చేస్తుంది.
బిగ్బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా… అన్నట్లుగానే ఈసారి మొత్తం ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. మొదట 14 మంది కంటెస్టెంట్.. అందులో ఐదుగురు ఎలిమినేట్ కావడం… ఆ తర్వాత మరో నలుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడంతో బిగ్బాస్ గేమ్ రసవత్తరంగా సాగుతుంది. అయితే బిగ్బాస్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వరుసగా ఐదు వారాలు అమ్మాయిలే ఎలిమినేట్ అయ్యారు. ఇక ఇప్పుడు ఆరోవారం ఎలిమినేషన్ టైమ్ వచ్చేసింది. అయితే ఈ వారం శోభా శెట్టి బయటకు వెళ్తుందని అంతా అనుకున్నారు. సోషల్ మీడియాలో పలు పోలింగ్స్ లోనూ అతి తక్కువ ఓటింగ్ వచ్చింది కూడా ఆమెకే. ఇక బిగ్బాస్ ప్రోమోస్ కు శోభాను ఎలిమినేట్ చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారంటే ఆమె హౌస్ నుంచి బయటకు రావాలని జనాలు ఎంతగా కోరుకుంటున్నారో తెలుస్తోంది. అయితే ఈ వారం నామినేషన్స్ దగ్గర్నుంచి ప్రతి టాస్కులోనూ శోభా ప్రవర్తించిన తీరుకు ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది. తన తప్పు స ఉందని చెప్పినా.. లేదా తనను ఆట నుంచి తప్పించిన సైకోలా మారిపోతుంది. చప్పట్లు కొడుతూ.. గట్టిగా అరుస్తూ హౌస్ మొత్తం గోల గోల చేస్తుంది. చివరకు ఏడుస్తూ రచ్చ చేస్తుంది. దీంతో ఈవారం ఆమెకు అతి తక్కువ ఓటింగ్ వచ్చింది. ఇక ఈవారం శోభా బయటకు వెళ్తుందనుకున్నారు.
కానీ చివరి నిమిషంలో శోభా కాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన నయని పావనిని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఆరోవారం నామినేషన్స్ లో శోభా శెట్టి, అమర్ దీప్, నయని పావని, పూజా, అశ్విని, ప్రిన్స్ యావర్ ఉన్నారు. ఇందులో అత్యధిక ఓటింగ్ తో ప్రిన్స్ యావర్ మొదటి స్థానంలో ఉన్నాడు . ఆ తర్వాత ఇప్పుడిప్పుడే గేమ్ స్టార్ట్ చేసిన అమర్ దీప్ కు ఎక్కువగానే ఓటింగ్ సంపాదించుకుని రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఆ తర్వాత నయనిపావనికి అధికంగా ఓటింగ్ ఉంది. ఆమె తర్వాత పూజా, అశ్విని కాస్త స్వల్ప ఓటింగ్ తేడాతో ముందంజలో ఉండగా.. అతి తక్కువ ఓటింగ్ తో చివరి స్థానంలో ఉంది శోభా శెట్టి.
View this post on Instagram
కానీ ఇప్పుడు చివరి నిమిషంలో నయని పావనిని ఎలిమినేట్ చేసినట్లుగా తెలుస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన నలుగురిలో అర్జున్, నయని పావని, పూజా ఈ ముగ్గురు మాత్రమే గేమ్ ఆడుతున్నారు. అలాగే ఇంటి సభ్యులందరితో కలిసి పోయింది నయని. ఇక యావర్ సెకండ్ కెప్టెన్ కావడంతో నయని కృషి ఎక్కువగానే ఉందని చెప్పాలి. కానీ వచ్చి వారం కూడా కాలేదు.. అప్పుడే ఈ బ్యూటీని ఎలిమినేట్ చేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. కనీసం ఆమెకు గేమ్ లో పెద్దగా నిరూపించుకునే ఛాన్స్ కూడా రాలేదని.. నిజానికి ఈ వారం శోభా శెట్టి ఎలిమినేట్ కావాల్సిన కంటెస్టెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.