Bigg Boss 7 Telugu: కెప్టెన్ అయ్యాక యావర్ అటిట్యూడ్ చేంజ్.. రతిక, దామిని, సుబ్బు రీఎంట్రీ ?..

|

Oct 14, 2023 | 6:27 PM

నిజానికి అతడిని కెప్టెన్ చేయడంలో నయని పావని కీలకపాత్ర ఉందనే చెప్పాలి. చివరి క్షణంలో కీ తీసుకువచ్చి యావర్ చేతికి అందించింది. అతను కెప్టెన్ అవ్వడంలో అతని వెన్నంటే ఉంది. ఇక్కడివరకు బాగానే ఉంది.. కానీ యావర్ బిహేవియర్ చేంజ్ అయినట్లుగా తెలుస్తోంది. హౌస్ లో రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తున్నట్లు.. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ కు చుక్కలు చూపిస్తున్నాడని తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే అది అనిపిస్తుంది. కెప్టెన్ అయ్యాక యావర్ ప్రవర్తనలో చాలానే మార్పు వచ్చిందంటూ వీడియో ప్లే చేశారు.

Bigg Boss 7 Telugu: కెప్టెన్ అయ్యాక యావర్ అటిట్యూడ్ చేంజ్.. రతిక, దామిని, సుబ్బు రీఎంట్రీ ?..
Bigg Boss 7 Telugu Promo
Follow us on

మొత్తానికి హౌస్ కు కింగ్ అయ్యాడు ప్రిన్స్ యావర్. పట్టు వదలని విక్రమార్కుడిలా మొదటి వారం నుంచి ఎంతో కష్టపడి ఎట్టకేలకు హాస్ సెకండ్ కెప్టెన్ అయ్యాడు. ఆట గాళ్లు, పోటుగాళ్ల మధ్య జరిగిన అన్ని టాస్కులలో ఆటగాళ్లు గెలవగా.. చివరగా బెలూన్ టాస్కులో గెలిచిన హౌస్ కెప్టెన్ అయ్యాడు. నిజానికి అతడిని కెప్టెన్ చేయడంలో నయని పావని కీలకపాత్ర ఉందనే చెప్పాలి. చివరి క్షణంలో కీ తీసుకువచ్చి యావర్ చేతికి అందించింది. అతను కెప్టెన్ అవ్వడంలో అతని వెన్నంటే ఉంది. ఇక్కడివరకు బాగానే ఉంది.. కానీ యావర్ బిహేవియర్ చేంజ్ అయినట్లుగా తెలుస్తోంది. హౌస్ లో రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తున్నట్లు.. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ కు చుక్కలు చూపిస్తున్నాడని తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే అది అనిపిస్తుంది. కెప్టెన్ అయ్యాక యావర్ ప్రవర్తనలో చాలానే మార్పు వచ్చిందంటూ వీడియో ప్లే చేశారు. ఆ తర్వాత అమర్ దీప్, యావర్ మధ్య జరిగిన గొడవలో సందీప్ తలదూర్చి గొడవను మరింత పెద్దగా చేశాడంటూ క్లాస్ తీసుకున్నారు.

బిగ్‏బాస్ సీజన్ 7 ఆరోవారం వీకెండ్ వచ్చేసింది. హౌస్మేట్స్ ఆట తీరు.. బిహేవియర్ పై తప్పొప్పులను తేల్చేందుకు రెడీ అయ్యారు హోస్ట్ నాగార్జున. తాజాగా విడుదలైన ప్రోమోలో హౌస్ రెండో కెప్టెన్ యావర్ కు క్లాస్ తీసుకున్నారు. ముందుగా యావర్ ను నిల్చోబెట్టి.. కెప్టెన్ అయ్యాక నీ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ కొంచెం మారింది కదా అంటూ వీడియోను చూపించారు. అందులో అమర్ దీప్, యావర్ మాట్లాడుకుంటూ కనిపించారు. అందులో అమర్ దీప్ తినడానికి తీసుకునేందుకు ట్రై చేయగా.. అడ్డుకున్నాడు యావర్. తినేదగ్గర ఇలా చేయకూడదని..యావర్ అంటూ వారిస్తూ కనిపించారు. అమర్, యావర్ మధ్య గొడవ జరుగుతుండగా.. సందీప్ వెళ్లడంపై ప్రశ్నించాడు నాగ్.

ఇక వీడియోలో అరెయ్ అంటూ సందీప్ పిలవగా.. యావర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత సందీప్, యావర్ మధ్య చిన్నపాటి గొడవే జరిగింది. ఇక చివరగా ఎలిమినేట్ అయిన రతిక రోజ్, సింగర్ దామిని, శుభ శ్రీ ఒకేసారి హౌస్ లోకి అడుగుపెట్టారు. అయితే వీరు ముగ్గురు కేవలం అతిథులుగా అడుగుపెట్టారా ?.. లేదా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చారా అనేది తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.