Bigg Boss 7 Telugu: ఈ వారం నామినేషన్స్ లిస్ట్ ఇదే.. ఆ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన రతిక..

| Edited By: Rajeev Rayala

Nov 15, 2023 | 7:38 AM

ప్రశాంత్ ను ఏమాత్రం మాట్లాడనివ్వకుండా రివర్స్ కౌంటర్స్ ఇచ్చాడు అర్జున్. ఇక అమర్, యావర్ మధ్య రతిక పెట్టిన చిచ్చు ఇంకా పెరుగుతూనే ఉంది. ఎప్పుడో రెండో వారంలో అన్న మాటలను తీసుకువచ్చి యావర్ ముందు పెట్టింది రతిక. దీంతో రెండు వారాలుగా అమర్ పై ఊగిపోతున్నాడు యావర్. పదవ వారంలో చెప్పిన పాయింట్ ఇప్పుడు మళ్లీ చెప్పేశాడు. దీంతో తాజాగా విడుదలైన ప్రోమోలో మాత్రం యావర్, అమర్ కొట్టుకున్నంత పని చేశారు. నువ్వా నేనా అంటూ అరుస్తూ ఒకరిపైకి మరొకరు వెళ్లగా.. కెప్టెన్ శివాజీ వారిద్దరిని ఆపే ప్రయత్నం చేశాడు.

Bigg Boss 7 Telugu: ఈ వారం నామినేషన్స్ లిస్ట్ ఇదే.. ఆ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన రతిక..
Bigg Boss 7 Telugu
Follow us on

11వ వారం నామినేషన్స్ రచ్చ జరుగుతుంది బిగ్‏బాస్ హౌస్‏లో. గతవారం ఫ్యామిలీ వీక్ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వారం నామినేషన్స్ పాయింట్స్ అంతగా సీరియస్‏గా ఉన్నట్లు కనిపించడం లేదు. దీంతో పదవ వారం నామినేషన్స్ రచ్చే మరోసారి తీసుకువచ్చారు కంటెస్టెంట్స్. ఇక గతవారం రాజమాతలుగా తమను డామినేట్ చేసిన ప్రియాంక, శోభా శెట్టిలను ఓ ఆడాడుకుంది రతిక. అలాగే అశ్వినీ సైతం అవే పాయింట్స్ చెప్పి వీరిద్దరిని నామినేట్ చేసింది. ఫస్ట్ ప్రోమోలో అర్జున్ వర్సెస్ ప్రశాంత్ మధ్య పెద్ద గొడవే జరిగింది. ప్రశాంత్ ను ఏమాత్రం మాట్లాడనివ్వకుండా రివర్స్ కౌంటర్స్ ఇచ్చాడు అర్జున్. ఇక అమర్, యావర్ మధ్య రతిక పెట్టిన చిచ్చు ఇంకా పెరుగుతూనే ఉంది. ఎప్పుడో రెండో వారంలో అన్న మాటలను తీసుకువచ్చి యావర్ ముందు పెట్టింది రతిక. దీంతో రెండు వారాలుగా అమర్ పై ఊగిపోతున్నాడు యావర్. పదవ వారంలో చెప్పిన పాయింట్ ఇప్పుడు మళ్లీ చెప్పేశాడు. దీంతో తాజాగా విడుదలైన ప్రోమోలో మాత్రం యావర్, అమర్ కొట్టుకున్నంత పని చేశారు. నువ్వా నేనా అంటూ అరుస్తూ ఒకరిపైకి మరొకరు వెళ్లగా.. కెప్టెన్ శివాజీ వారిద్దరిని ఆపే ప్రయత్నం చేశాడు. మొత్తానికి బయటి నుంచి మళ్లీ వచ్చిన రతిక ఈ ఇద్దరి మధ్య పెద్ద చిచ్చు పెట్టేసింది.

బయటకు వెళ్లొచ్చిన దానివి ఎవరిపై ఇలాంటి పాయింట్స్ చెప్పకు రతిక అంటూ చురక వేశాడు అమర్. తవ్వుకుంటూ పోతే అందరి జాతకాలు అంతే.. ఏమంత గొప్ప జాతకాలు కావు ఎవ్వరివీ అంటూ మళ్లీ డైలాగ్ వేశాడు. ఆ తర్వాత యావర్, అమర్ మధ్య బిహేవియర్ గురించి టాపిక్ రావడంతో రతికాతో నేను చెప్పింది చూశావా అంటూ యావర్ మీదకు దూసుకెళ్లాడు అమర్ దీప్. ఇద్దరూ ఏకంగా కొట్టుకునే స్థాయికి అరుచుకుంటూ వెళ్లడంతో కెప్టెన్ శివాజీ ఇద్దర్నీ ఆపేశాడు. చివరగా గౌతమ్ ఆవేశం తగ్గించుకోవాలంటూ శివాజీ నామినేట్ చేశాడు. ఎమోషనల్ లైక్ లూజ్ మోషన్ ఇన్ బిగ్ బాస్ హౌస్.. ఫ్లోను ఆపలేం అంటూ కౌంటర్ ఇచ్చాడు గౌతమ్. దాన్నే కంట్రోల్ చేసుకోవాలిరా.. మంచిదిలా అంటూ నామినేట్ చేశాడు శివాజీ.

అయితే ఈరోజు ఎపిసోడ్ తో ఈవారం నామినేషన్స్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ సోషల్ మీడియాలో వైరలవుతున్న సమాచరం ప్రకారం ఈ వారం మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

1. ప్రియాంక
2. యావర్
3. అమర్ దీప్
4. గౌతమ్
5. శోభా శెట్టి
6. అశ్విని
7. రతిక
8. అర్జున్

ఈవారం ఈ ఎనిమిది మంది నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈవారం శివాజీ, పల్లవి ప్రశాంత్ ఇద్దరూ నామినేషన్స్ నుంచి సేవ్ అయినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ ను కేవలం అర్జున్ మాత్రమే నామినేట్ చేసినట్లు తెలుస్తోంది.

– సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)

మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..