Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ కొత్త సీజన్‌పై క్రేజీ రూమర్.. కంటెస్టెంట్లుగా ఎవరెవరు రానున్నారంటే?
Bigg Boss 6 Telugu: బుల్లితెర రియాలిటీ షోల్లో బిగ్‌బాస్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిందీతో మొదలై అన్ని భాషల్లోనూ ఈ గేమ్‌షో సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇక తెలుగు ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్న
Bigg Boss 6 Telugu: బుల్లితెర రియాలిటీ షోల్లో బిగ్‌బాస్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిందీతో మొదలై అన్ని భాషల్లోనూ ఈ గేమ్‌షో సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇక తెలుగు ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్న ఈ రియాలిటీ షో ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆ మధ్యన నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ ఓటీటీలో వచ్చిన బిగ్‌బాస్ పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. కేవలం హాట్‌స్టార్‌లోనే దీనిని ప్రసారం చేయడంతో చాలామంది ఈ రియాలిటీ షోను మిస్ అయ్యారు. అయితే ఈ లోటును పూడ్చుతూ త్వరలోనే కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా సెప్టెంబర్‌లో కొత్త సీజన్ ఘనంగా లాంచ్ కానుంది. బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగపెట్టే సభ్యుల ఎంపిక కూడా దాదాపు పూర్తి కావొచ్చినట్లు సమాచారం.
కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. స్టార్ యాంకర్ ఉదయభాను, దీపికా పిల్లి, శ్రీహాన్, నేహా చౌదరి, ఆర్జే సూర్య, అమర్‌దీప్, ఆది రెడ్డి, చలాకీ చంటి, గీతూ రాయల్.. తదితరులు బిగ్‌బాస్‌లో సందడి చేయనున్నారట. ఇక గత సీజన్‌లో సిరి రాగా, ఈసారి ఆమె బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ వస్తుండడం షోపై ఆసక్తి పెంచుతోంది. కాగా బుల్లితెర నటుడు అమర్ దీప్ తన ప్రేయసి, నటి తేజస్వితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కనున్నట్లు తెలుస్తోంది. మరి పెళ్లి చేసుకుని బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెడతాడా? లేక షోనుంచి బయటికొచ్చాక ఏడడుగులు వేస్తాడా? అన్నది చూడాలి. మరి ఈ షో కంటెస్టెంట్లు, ఇతర వివరాలు వివరంగా తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే!
#BiggBossTelugu6 makes it more captivating to all audiences of Telugu. The color palette used for the fluidic lines comes together to create an intense emotional experienced when it begins. This time, #BiggBoss eye is alluring Season of Entertainment begins soon on #StarMaa. pic.twitter.com/EmjwkdKFps
— starmaa (@StarMaa) August 4, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..