Bigg Boss Telugu 5 Finale: బిగ్‌బాస్‌ 5 తెలుగు గ్రాండ్‌ ఫినాలే.. ఎప్పుడు.. ఎక్కడ.. ముఖ్య అతిథులుగా ఎవరు..?

Bigg Boss Telugu 5: తెలుగులో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ రియాలిటీ షోకు ఎంతో ఆదరణ లభిస్తోంది.  ఇన్ని రోజులు బుల్లి తెర ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేసిన బిగ్ బాస్ సీజన్ 5..

Bigg Boss Telugu 5 Finale: బిగ్‌బాస్‌ 5 తెలుగు గ్రాండ్‌ ఫినాలే.. ఎప్పుడు.. ఎక్కడ.. ముఖ్య అతిథులుగా ఎవరు..?

Edited By: Rajitha Chanti

Updated on: Dec 19, 2021 | 11:08 AM

Bigg Boss Telugu Season 5 Finale : తెలుగులో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ రియాలిటీ షోకు ఎంతో ఆదరణ లభిస్తోంది.  ఇన్ని రోజులు బుల్లి తెర ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేసిన బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. దాదాపు 106 రోజుల ప్రయాణం తరువాత బిగ్ బాస్‌ ఇవ్వాల్టి ఫినాలే ఘట్టంతో ముగియనుంది.  దీంతో విజేత ఎవరో తేలిపోనుంది. అయితే ఈ బిగ్‌బాస్‌ సీజన్ 5 ఫినాలేను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ లో ఒకరు విజేతగా నిలవనున్నారు. ప్రస్తుతం హౌస్ లోసిరి, షణ్ముఖ్, సన్నీ, శ్రీరామ్, మానస్ ఉన్నారు. ఈ ఐదుగురిలో రేపు విన్నర్ ఎవరన్నది రేపు (ఆదివారం) తేలిపోనుంది. ఇక హౌస్ లో ఉన్న వారిలో ఎక్కువగా సన్నీ, శ్రీరామ్ కు ఓట్లు పడుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఆదివారం టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ నేడు జరగనుంది.

గ్రాండ్‌ ఫినాలే సమయం:
బిగ్‌బాస్‌ 5 గ్రాండ్‌ ఫినాలే డిసెంబర్‌ 19 (ఆదివారం) సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా నిర్వహిస్తున్న ఈ షో.. ప్ర్ముఖ తెలుగు ఛానెల్‌ స్టార్‌మాలో ప్రసారం కానుంది. ఎపిసోడ్‌ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ+హాట్‌స్టార్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. 106 రోజుల పాటు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్‌లో సిరి ఎలిమినెట్‌ కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మిగతా నలుగురిని ఇద్దరు ఎలిమినెట్‌ అయి స్టేజీపై ఇద్దరు ఉంటారు. అందులో ఒకరు విజేతగా నిలువనున్నారు.

గ్రాండ్‌ ఫినాలేకు ప్రత్యేక అతిథులు:
ఇక నిన్నటివరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్‌గా వస్తారని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత బాలీవుడ్ కపుల్ రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొనె హాజరుకానున్నారని గుసగుసలు వినిపించాయి. ఇక ఇప్పుడు రణ్ బీర్ కపూర్, అలియా భట్ హాజరవుతారని అంటున్నారు. నాగార్జున, అలియా భట్‌ ఇటీవల బాలీవుడ్‌ మూవీ బ్రహ్మస్త్రలో కలిసి నటించారు.

ఇవి కూడా చదవండి:

Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ ఫినాలే.. గెలిచేది ఎవరంటే.. కంటెస్టెంట్ల బలాలు, బలహీనతలు

Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ హౌస్‌లో సిరి, షణ్నులది లవ్‌ సిరీస్‌ను తలపిస్తోందా..?