Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 రోజు రోజుకు వైలెంట్‌గా మారుతుంది. ఇప్పటికే విచిత్రమైన టాస్కులతో హౌస్ మేట్స్ మధ్య అగ్గి రాజేస్తున్నాడు బిగ్ బాస్.. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో జరిగిన టాస్క్ అయితే మరీనూ.. ఇంటి సభ్యులు ఒకరి పై ఒకరు పడి మరీ కొట్టుకున్నారు. మొన్నటికి మొన్న బూతులతో వీరంగం సృష్టించిన హౌస్ మేట్స్ ఈ సారి మరింత రెచ్చిపోయి కొట్లాటకు దిగారు. బిగ్ బాస్ హౌస్‌లో అందరితో కలిసి పోయి మాట్లాడుతూనే అందరిపై కౌంటర్‌లు వేసే ప్రియకు కోపం తెపించాడు సన్నీ దాంతో సన్నీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది ప్రియా. నీ ఆటిట్యూడ్ నా దగ్గర చూపించకు.. నోరు మూసుకుని నీ పని నువ్ చూసుకో.. అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ప్రియా. దాంతో సన్నీ మైండ్ బ్లాక్ అయ్యింది. వెంటనే సన్నీ నోరు మూసుకో అనడం తప్పు ప్రియగారు అని అనేలోగా.. ప్రియా మరింత సీరియస్ అయ్యింది. దానికి మీరే కాదు నేను మాట్లాడగలను.. నాకు కూడా చాలా వస్తాయ్ అని సన్నీ కూడా ఫైర్ అయ్యాడు.. దానికి ప్రియా ..‘అనండీ.. ఇంతకు ముందు హే.. పో అని అనలేదా? అప్పటి నుంచి నీ మీద నాకు గౌరవమే పోయింది’ అంటూ సన్నీపై విరుచుకు పడింది ప్రియ.
అలాగే ప్రియా శ్వేతా మీద కూడా ఫైర్ అయ్యింది. శ్వేత మరీ పిచ్చెక్కినట్టుగా ప్రవర్తిస్తుందని ఏకిపారేసింది.. ఆమె చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుందని.. రాత్రి అయ్యేసరికి పిచ్చిపడుతుంది ఆమె ట్రాన్స్‌లోకి వెళ్లిపోయి ఏం చేస్తుందో తెలియడం లేదని అంది ప్రియా.. మొత్తానికి మొన్నటివరకు సైలెంట్‌గా ఉన్న ప్రియకు కూడా కోపం తెప్పించారు హౌస్ మేట్స్. దాంతో ప్రియతో జాగ్రత్తగా ఉండాలని ఇంటి సభ్యులు లోలోపల అనుకున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి : ప్రజంట్ టాలీవుడ్‌లో దూసుకుపోతున్న ఓ నటే.. ఈ ఫోటోలోని చిన్నారి.. ఎవరో గుర్తించగలరా…?
Viral Pic: ఈ ఫోటోలోని చిన్నారి చాలా ఫేమస్.. ఇప్పుడొక హీరోయిన్.. కుర్రకారులో విపరీతమైన ఫాలోయింగ్..
Gully Rowdy Pre Release Event: థియేటర్లలో సందడి చేయనున్న రౌడీ.. ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో..
Zee kutumbam awards: మొదలైన జీ కుటుంబం అవార్డుల సందడి.. మీ అభిమాన స్టార్స్‌కు ఇలా ఓటు వేయండి.