
బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో తొమ్మిదో సీజన్ త్వరలోనే షూరూ కానుంది. సెప్టెంబర్ 07 లేదా సెప్టెంబర్ 15న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈసారి హౌస్ లోకి అడుగు పెట్టే కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటోంది బిగ్ బాస్ యాజమాన్యం. అందులో భాగంగానే ఈసారి ఇంటిలోకి సామాన్యులకు ప్రవేశం కల్పించడం కోసం ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయి. అలా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు అనూషా రత్నం. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఆమెది మన తెలంగాణే. వరంగల్ లోనే పుట్టి పెరిగింది. ఎమ్మెస్సీ పూర్తి చేసిన ఆమె ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరింది. సుమారు ఐదేళ్ల పాటు ఈ రంగంలోనే పని చేసింది. అయితే ఆ తర్వాత జాబ్ నుంచి బయటకు వచ్చి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా మారిపోయింది. అప్పటి నుంచి ఆమెకు పేరుకు పేరు, డబ్బుకు డబ్బు వచ్చాయి. ప్రస్తుతం ఇన్‌స్టా గ్రామ్ లో అనూషకు సుమారు 280k ఫాలోవర్లు ఉన్నారు. కాగా సినిమా సెలబ్రిటీలతో నూ అనూషకు మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ నుంచి ఒక మెసేజ్ వచ్చిందని అనూష పేర్కొన్నారు. రఘు కుంచె తనకు సపోర్ట్ చేశారని, వీడియోస్ బావున్నాయని చెబుతూ ఉంటారని అనూష పేర్కొంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనూష అప్పుడప్పుడు కొన్ని సినిమా ఈవెంట్స్‌కు కూడా వస్తుంటుంది. యాంకరింగ్ కూడా చేస్తుంటుంది. ఇటీవల ‘వర్జిన్ బాయ్స్’ సినిమా ఈవెంట్ కు అనూష హాజరైంది. అలాగే న్యాచురల్ స్టార్ నాని హిట్ 3, విజయ్ ఆంటోని మార్గన్ సినిమా రిలీజ్ ల సమయంలో ఆయా హీరలతో కలిసి కొన్ని ఆసక్తికర వీడియోలు కూడా చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.