బుల్లితెరపై రష్మీ గౌతమ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు…. అందం..మాట తీరుతో ప్రస్తుతం ఉన్న టాప్ యాంకర్స్‌లలో ఒకరిగా కొనసాగుతుంది రష్మీ. ఓవైపు బుల్లితెరపై సత్తా చాటుతూనే.. మరోవైపు వెండితెరపై రాణిస్తుంది రష్మీ. అలాగే.. సోషల్ మీడియాలోనూ.. తన లెటేస్ట్ ఫోటోస్.. అప్డేట్స్ షేర్ చేస్తూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక సమాజంలో జరుగుతున్న ఘటనలపైనూ రష్మీ రియాక్ట్ అవుతుంటుంది. అయితే.. రష్మీ జంతుప్రేమికురాలు అన్న సంగతి తెలిసిందే. జంతువులపై దాడి చేసే ఘటనలపై.. వాటికి హాని కలిగించే విషయాలపై ఎప్పటికప్పుడు రష్మీ స్పందిస్తుంటుంది. జంతువులకు ఎలాంటి హాని కలిగిన అస్సలు ఊరుకోదు. గతంలోనూ వీధి కుక్కలపై జరుగుతున్న చికిత్స విషయంలోనూ రష్మీ స్పందించింది..
తాజాగా మరోసారి వీధి కుక్కలపై జరిగిన దాడి విషయంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడుతూ ఎమోషనల్ అయ్యింది రష్మీ. ఇటీవల దీపావళి సంబరాల్లో పశ్చిమ బెంగాల్లో దారుణ ఘటన జరిగింది. అందరూ దీపావళి సంబరాలు జరుపుకుంటుండగా.. కొందరు ఆకతాయిలు.. ఓ వీధి కుక్కపై తమ సైకోయిజాన్ని చూపించారు. కుక్క తోకకు టపాసులు కట్టి పేల్చేశారు. దీంతో ఆ కుక్క కాలుకు తీవ్ర గాయాలై.. తోక తెగి పడింది. ఇది గమనించిన చుట్టుపక్కల జనం ఆ కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ప్రస్తుతం ఆ కుక్క సురక్షితంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న రష్మీ.. ఆ ఘటన పై తనదైన స్టైల్లో స్పందించింది. మానవత్వం చచ్చిపోయింది. ఈ భూమి పై మనవజాతి అంతరించే సమయం వచ్చింది అంటూ ఆ ఘటనకు సంబంధించిన వార్తను పోస్ట్ చేసింది. ఇక ఘటన గురించి తెలిసిన నెటిజన్స్ సైతం ఆ ఆకతాయిలను కఠినంగా శిక్షించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Samantha: సమంత మంచి మనసు.. హీరోయిన్‌కు అండగ నిలిచిన సామ్..
Samantha: గాయాల నుంచి ఉపశమనం పొందే మార్గం.. ఇక జరిగింది చాలు.. సమంత ఆసక్తికర పోస్ట్..
Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్‌బాస్‌లో నా సపోర్ట్ అతనికే.. సోనూసూద్ వీడియో వైరల్..