Anchor Pradeep: పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన ప్రదీప్.. అనవసరంగా ఆ అమ్మాయి పేరు తీసుకువచ్చారంటూ..
ఇటీవల మరోసారి ప్రదీప్ పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. సెలబ్రిటీ స్టైలిస్ట్ నవ్య మారౌతుతో ప్రదీప్ నిశ్చితార్థం అయిపోయిందని.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ వినిపించాయి
బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు యాంకర్ ప్రదీప్. సోషల్ మీడియాలో అతడికి ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ప్రదీప్ కు అభిమానులే. షోలో ఆయన ఉంటే సందడి వేరుగా ఉంటుంది. తనదైన పంచులతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. అయితే ప్రదీప్ పెళ్లి గురించి అనేక సార్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. అప్పట్లో తన పెళ్లి కోసం ఓ టీవీ ప్రోగ్రాం పెట్టి స్వయంవరం చేసుకున్నారు.. దీంతో ఈసారి పెళ్లి జరిగిపోతుందనుకున్నారు అంతా. కానీ అది కేవలం షో మాత్రమే అని తేల్చీ చెప్పారు. ఇక ఇటీవల మరోసారి ప్రదీప్ పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. సెలబ్రిటీ స్టైలిస్ట్ నవ్య మారౌతుతో ప్రదీప్ నిశ్చితార్థం అయిపోయిందని.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ వినిపించాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించారు యాంకర్ ప్రదీప్. అందులో ఎలాంటి నిజం లేదని.. తమకు కనీసం పరిచయం కూడా లేదన్నారు.
ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రదీప్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం నేను చాలా బిజీగా ఉన్నాను. అందుకే ఈ విషయాలపై నేను ఇప్పటివరకు స్పందించలేదు. నాకు నిశ్చితార్థం జరిగిందని వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదు. నేను ఇప్పటికీ సింగిల్ గా సంతోషంగా ఉన్నాను. నాకు భార్య కాబోతుందని చెబుతున్న డిజైనర్ తో కనీసం నాకు పరిచయం కూడా లేదు. ఆమె దగ్గర నుంచి నా టీమ్ దుస్తులు కొనుగోలు చేసి ఉండొచ్చు. మా అధికారిక హ్యాండిల్స్ లో ఆమెను ట్యాగ్ చేసి ఉండొచ్చు. అంతేకానీ ఆవిడకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆమెను అనవసరంగా ఇందులోకి తీసుకువచ్చారు. ఆమె విషయంలో నాకు చాలా బాధగా ఉంది ” అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదని.. ఇప్పుడిప్పుడే తన కుటుంబం తన తండ్రి చనిపోయిన బాధ నుంచి కోలుకుంటుందని.. పెళ్లికి ఇంకాస్త సమయం ఉందని.. ప్రస్తుతం తన రెండో సినిమాపై మాత్రమే తాను ఫోకస్ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాదిలో హీరోగా తన రెండో సినిమా రాబోతుందని.. అందుకోసం రెస్ట్ లేకుండా కష్టపడుతున్నట్లు తెలిపారు. మొత్తానికి పెళ్లి వార్తలకు తన స్టైల్లో చెక్ పెట్టేశాడు ప్రదీప్.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.