మరో వారం రోజుల్లో బుల్లితెరపై బిగ్బాస్ రియాల్టీ షో సందడి స్టార్ట్ కానుంది. టీవీ అడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ షో సెప్టెంబర్ 1న సాయంత్రం 7 గంటలకు ప్రారంభంకానున్నట్లు ఇదివరకే నిర్వాహకులు ప్రకటించారు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. సీరియల్ నటీనటులు, యాంకర్స్, సోషల్ మీడియా స్టార్స్, సినిమా యాక్టర్స్ పేర్లు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు కంటెస్టెంట్స్ ఎవరనేది మాత్రం కన్ఫార్మ్ కాలేదు. ఇప్పటికే కొందరు ఇంటర్వ్యూలు కంప్లీట్ అయ్యి అగ్రీమెంట్ పై సంతకం చేయాలా ?వద్దా ? అని ఆలోచిస్తుండగా.. మరికొందరి విషయంలో ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయట. అలాగే కొందరు తారలు బిగ్బాస్ ఆఫర్ రిజెక్ట్ చేయగా.. ఇంకొందరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా ఓకే అన్నట్లుగా వెయిట్ చేస్తున్నారు. అయితే మొదటి నుంచి బిగ్బాస్ లోకి ఎంట్రీ అంటూ అమృతా ప్రణయ్ పేరు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు చాలా మంది నెటిజన్స్ కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం అమృతా బిగ్బాస్ హౌస్ లోకి వెళ్లొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. తాజాగా బిగ్బాస్ ఆఫర్ పై స్పందించింది అమృతా ప్రణయ్.
బిగ్బాస్ ఆఫర్ గురించి క్లారిటీ ఇచ్చింది అమృతా ప్రణయ్. తనకు ఇప్పటివరకు తనకు బిగ్బాస్ వాళ్ల నుంచి ఎలాంటి కాల్ రాలేదని అన్నారు. అమృతా ప్రణయ్ మాట్లాడుతూ..”చాలా మంది నన్ను బిగ్బాస్ షోకు వెళ్తున్నావా ? అని అడుగుతున్నారు. అమ్మ కూడా అడిగింది. ఒకవేళ వెళ్లేది ఉంటే ముందు చెప్పు… ప్రిపేర్ అయ్యి ఉంటాం అని అంటుంది. ఇక మా ఆంటీ వాళ్లు అయితే మాకు చెప్పకుండా వెళ్తున్నావా..? అని అంటున్నారు. నేను వెళ్లడం లేదు అని చెప్తున్నాను. కానీ అగ్రిమెంట్ ప్రకారం చెప్పొద్దన్నారని.. అందుకే నేను చెప్పడం లేదని అనుకుంటున్నారు. నేను బిగ్బాస్ షోకు వెళ్లడం లేదు. అసలు వాళ్ల నుంచి కాల్ రాలేదు. బిగ్బాస్ షోకు వెళ్తున్నట్లు నా పేరు ఎలా బయటకు వచ్చిందో నాకు తెలియదు.
ఒకవేళ బిగ్బాస్ ఆఫర్ వస్తే వెళ్తారా..? అని అడుగుతున్నారు.. అప్పుడున్న పరిస్థితిని బట్టి ఆలోచిస్తాను… ఇప్పుడు మాత్రం నేను బిగ్బాస్ షోకు వెళ్లడం లేదు. నాకు వాళ్ల నుంచి ఎలాంటి కాల్ రాలేదు. కానీ నేను వెళ్తున్నానని చాలా మంది కంగ్రాట్స్ చెబుతున్నారు. ఆల్ ది బెస్ట్ అంటున్నారు. నేను ఎక్కడికీ వెళ్లడం లేదు.. మిర్యాలగూడ, హైదరాబాద్ తిరుగుతూనే ఉన్నాను.. నాకు ఆషోకు వెళ్లాలనే ఆలోచన మాత్రం లేదు” అంటూ చెప్పుకొచ్చింది అమృతా.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.