బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన వాళ్లలో ఈ అమ్మడు చాలా హుషారుగా కనిపించింది. నిన్న మొన్నటివరకు సోషల్ మీడియాలో కనిపించి హల్‌చల్ చేసిన ఈ బోల్డ్ బ్యూటీ ఇప్పుడు బిగ్ బాస్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వబోతుంది. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. సరయు. 7 ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు షార్ట్ ఫిలిమ్స్, సిరీస్‌లు చేసింది సరయు. అయితే ఈ అమ్మడు ఎక్కువగా బోల్డ్ కంటెంట్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో బోల్డ్‌గా ఉండే ఈ బ్యూటీ బిగ్ బాస్ వేదిక మీద కూడా తన డబల్ మీనింగ్ డైలాగ్స్‌తో రచ్చ చేసింది. పదమూడో కంటెస్టెంటుగా సరయు వచ్చింది. యూట్యూబర్‌గా ఫేమస్ అయిన సరయు బిగ్ బాస్ వేదికపైన తనదైన మాటలతో ఆకట్టుకుంది. అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్‌తోపాటు తన గురించి వివరిస్తూ ఓ వీడియా చేసింది సరయు.
ఇక బిగ్ బాస్ వేదిక పైకి వేస్తూనే తన గమ్మతైనా మాటలతో హోస్ట్ కింగ్ నాగార్జునను ఇంప్రస్ చేసింది. నాగ్ కొన్ని పదాలు చెప్పి అవి తన స్టైల్‌లో చెప్పమని సరయును అడిగాడు. దానికి సై అన్న ఈ బ్యూటీ. మింగకు, మింగేయ్ రా, కథలు పడకు అంటూ తనదైన స్టైల్‌లో మాట్లాడి ఆకట్టుకుంది. అంతే కాదు బిగ్ బాస్ అయినా ఎవరైనా సరే ధమ్ ధమ్ లాడిస్తాను అంటూ సరయు రెచ్చిపోయింది. చిన్నప్పుడు తన తల్లితో కలిసి అన్నపూర్ణ స్టూడియో చూశానని.. అప్పుడే అనుకున్నా ఎలాగైనా .. ఒక్కసారైనా.. అందులోకి వెళ్లాలని. ఇప్పుడు ఆ కోరిక నెరవేరింది అని తెలిపింది సరయు. మరి ఈ క్రేజీ బ్యూటీ బిగ్ బాస్ హౌస్‌లో ఎలా రాణిస్తుందో చూడాలి.
Kangana Ranaut Photos: ‘తలైవి’గా వస్తున్న ‘కంగనా రనౌత్’.. చీరకట్టులో మెరుపులు..
Bigg Boss5: బిగ్ బాస్ కలర్ ఫుల్ స్టార్ట్..కంటతడి పెట్టించిన నటరాజ్ మాస్టర్..ఎమోషనల్ ఎంట్రీ!