`త్వరలో వెంకీ పింకీ జంప్` సినిమాకు క్లాప్ కొట్టిన హరీష్ రావు.. టైటిల్ ఆసక్తికరంగా ఉందన్న మంత్రి..
`ప్రేమ పిలుస్తోంది` చిత్రంతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ నాతరి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై శ్రీమతి లక్ష్మీరేసు సమర్పణలో
‘ప్రేమ పిలుస్తోంది` చిత్రంతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ నాతరి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై శ్రీమతి లక్ష్మీరేసు సమర్పణలో వెంకట్ ఆర్ నిర్మిస్తోన్న చిత్రం `త్వరలో వెంకీ పింకీ జంప్`. విక్రమ్, దేవకి రమ్య, హర్సిత హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు. హరీష్ రావు తొలి సన్నివేశానికి క్లాప్ నివ్వగా, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. మున్పిపల్ ఛైర్మన్ రాజనర్సు, కళాంజలి రాజేష్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ…“పూర్తిగా తెలంగాణ యాస, భాషలతో . తెలంగాణ కళాకారులతో ఈ చిత్రం రూపొందుతోంది . సిద్దిపేటలోనే షూటింగ్ మొత్తం జరుపుకోనుంది. టైటిల్ ఆసక్తికరంగా ఉంది. నిర్మాత వెంకట్ కు, దర్శకుడు అజయ్ కు ఈ చిత్రం మంచి పేరు తీసుకరావాలని“ అన్నారు. అలాగే దర్శకుడు అజయ్ నాతరి మాట్లాడుతూ…“లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. దాదాపు రెండు నెలల పాటు సింగిల్ షెడ్యూల్ లో ఈ చిత్రాన్ని సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో పూర్తి చేస్తాం“ అన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల సింగర్ రాహుల్ సిప్లిగంజ్ హీరోగా తెరకెక్కుతున్న చిచ్చ సినిమా కార్యక్రమంలో కూడా హరీష్ రావు పాల్గొన్నారు. తెలంగాణాలో ఎంతో మంది కళాకారులు ఉన్నారని.. అందరికి అవకాశాలు కల్పించాలని ఆయన అన్నారు. అలాగే సిద్దిపేట లో అందమైన లొకేషన్స్ ఉన్నాయని సినిమా షూటింగ్ లకు అనువుగా ఉంటుందని అన్నారు హరీష్ రావు.
మరిన్ని ఇక్కడ చదవండి :