Gaddar: గద్దర్ నటించిన చివరి సినిమా.. ఆ సమస్యపైనే పోరాటం..

| Edited By: Aravind B

Sep 19, 2023 | 8:17 PM

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత కొంతకాలంగా ఏపీ ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. అయితే దీనిపై త్వరలోనే ఓ సినిమా కూడా రాబోతుంది. సత్యారెడ్డి అనే ఔత్సాహిక కథానాయకుడు నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పోరాటం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జనం ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల చివర షెడ్యూల్‌ పూర్తయింది. ఇందులో ప్రజాగాయకుడు గద్దర్‌ కీలక పాత్ర పోషించారు.

Gaddar: గద్దర్ నటించిన చివరి సినిమా.. ఆ సమస్యపైనే పోరాటం..
Gaddar's Last Film
Follow us on

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత కొంతకాలంగా ఏపీ ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. అయితే దీనిపై త్వరలోనే ఓ సినిమా కూడా రాబోతుంది. సత్యారెడ్డి అనే ఔత్సాహిక కథానాయకుడు నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పోరాటం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జనం ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల చివర షెడ్యూల్‌ పూర్తయింది. ఇందులో ప్రజాగాయకుడు గద్దర్‌ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో పల్సర్‌ బైక్‌ ఝాన్సీ కథానాయికగా పరిచయమవుతున్నారు. వైజాగ్‌ ఎంపీ ఎం.వి.వి.సత్యానారాయణ, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో పాటు స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాట కమిటీ జేఎసీ ఛైర్మన్‌ అయెధ్య రామ్‌, మర్రి రాజశేఖర్‌, ఆదినారాయణ, కెఎస్‌ఎన్‌ రావుతోపాటు యూనియన్‌ లీడర్లంతా ఇందులో నటించడం విశేషం

గద్దర్ చివరి చిత్రం
విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు నినాదంతో నిర్మించిన ఈ చిత్రంలో ప్రజా యుద్దానౌక గద్దర్ చివరి చిత్రం అని అన్నారు దర్శక నిర్మాత హీరో సత్యారెడ్డి. పల్సర్ బైక్ ఝాన్సీ తో కలిసి నిర్మించిన “ఉక్కు సత్యాగ్రహం” సినిమా బృందం మంగళ వారం విశాఖలో మీడియా సమావేశం నిర్వహించింది. సత్యారెడ్డి ఈ చిత్ర విశేషాలను వెల్లడిస్తూ ప్రముఖ వాగ్గేయ కారుడు ప్రజా యుద్ద నౌక గద్దర్ నటించిన చివరి సినిమా ఇదే అన్నారు. ఇందులో ఆయన పాత్ర వీరోచితంగా వుంటుందన్నారు. ఆయన ఈ సినిమా కోసం మూడు పాటలు రాయగా, సుద్దాల అశోక్ తేజ రెండు పాటలు రాశారని అన్నారు. ఇదివరకే ఈ చిత్రం కోసం గద్దర్ రచించి, పాడిన ‘సమ్మె నీ జన్మహక్కురన్నో’ అంటూ సాగే లిరికల్ వీడియో పాటను మే డే సందర్భంగా గద్దర్ తన చేతుల మీదుగానే విడుదల చేశారు. ముఖ్యంగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అలాగే చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీలు కూడా ఈ చిత్రంలో నటించడం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని వివరించే ప్రయత్నం చేయడం లాంటి అనేక సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ నిలుస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఇవి కూడా చదవండి

900 రోజుల ఉక్కు పోరాటమే కథాంశం
విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి పెట్టుబడుల ఉపసంహరణ, అనంతరం కార్మికుల్లో పెల్లుబికిన ఆగ్రహావేశాలు, రాజకీయ పార్టీల విన్యాసాలు, 900 రోజులుగా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న పోరాటాన్ని ఈ సినిమాలో తెరకెక్కించామన్నారు సత్యా రెడ్డి. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో విడదల చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలోనే ఆర్‎కే బీచ్‎లో చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. హైదరాబాద్‎లో కొద్ది రోజుల్లో టీజర్, ట్రైలర్ విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. స్టీల్ ప్లాంట్ పోరాట నాయకులు ఆదినారాయణ, అయోధ్య రామ్ మాట్లాడుతూ, గత 900 రోజులుగా కార్మికులు చేస్తున్న ఉద్యమాన్ని, మా పోరాట పటిమను సినిమా రూపంలో తెరకు ఎక్కించడం అభినందనీయం అన్నారు. అనంతరం చిత్ర యూనిట్ సినిమా టైటిల్ విడుదల చేసింది. హీరోయిన్ పల్సర్ బైక్ ఝాన్సి మాట్లాడుతూ, జరుగుతున్న కథ తో తీసిన సినిమాలో నటించడం ఆనందంగా ఉందని అన్నారు. గద్దర్ నటించిన చివరి సినిమాలో పాత్ర పోషించడం సంతోషంగా ఉందని అన్నారు. ఎక్కువభాగం స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ జరిగిన ఈ సినిమా కోసం స్టీల్ ప్లాంట్ కార్మికులతో పాటు విశాఖ వాసుల్లో ఆసక్తి నెలకొంది.