సినిమా ఇండస్ట్రీలో విషాదాలు ఆగడం లేదు. తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ డైరెక్టర్, కమెడియన్ టీపీ గజేంద్రన్(68) ఆదివారం కన్నుమూశారు. గతకొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుని శనివారం ఇంటికి వచ్చారు. అయితే ఆ మరునాడే కన్నుమూశాడు. దీంతో సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కాగా టీపీ గజేంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్‌కు క్లోజ్ ఫ్రెండ్. ఇద్దరూ కలిసి కాలేజీలో చదువుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్టాలిన్ నటుడి ఇంటికి చేరుకుని నివాళులర్పించారు. కాగా కొద్ది రోజుల క్రితం ఎంకే స్టాలిన్ కూడా టీపీ గజేంద్రన్ ఇంటికి వెళ్లి ఆయనను కలిసారు. ఇక సినిమాల విషాయనికొస్తే..1985లో చిదంబర రహస్యం సినిమాతో నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు గజేంద్రన్. 1988లో వీడు మనైవి మక్కల్ మూవీతో దర్శకుడిగా మారారు. బడ్జెట్ పద్మనాభం, చీనా తానా, మిడిల్ క్లాస్ మాధవన్, బండ పరమశివం వంటి సహా తమిళంలో పలు కామెడీ చిత్రాలను తెరకెక్కించారు. దాదాపు వంద సినిమాల్లో నటించిన ఆయన చివరగా యోగిబాబు పన్ని కుట్టి చిత్రంలో కనిపించారు.
కాగా ఇటీవల ప్రముఖ దిగ్గజ గాయని వాణీ జయరాం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆదివారం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆమెకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికింది. బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వాణీ జయరాం నివాసానికి వచ్చారు. దిగ్గజ గాయని పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘వాణీజయరాంకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మభూషన్ అవార్డు ప్రకటించింది. దురదృష్టవశాత్తు ఆ పురస్కారం తీసుకోకుండానే ఆమె కన్నుమూశారు. వాణీజయరాం కుటుంబ సభ్యులకు, సినీ లోకానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’అని స్టాలిన్సంతాపం తెలిపారు.
“பிரபல இயக்குநரும், நடிகரும், எனது கல்லூரித் தோழருமான இனிய நண்பர் திரு. டி.பி.கஜேந்திரன் அவர்கள் மறைவுற்ற செய்தி, மிகுந்த வருத்ததையும், அதிர்ச்சியையும் அளிக்கிறது.
1/2 pic.twitter.com/YNVhpAgBab
— CMOTamilNadu (@CMOTamilnadu) February 5, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..