కరోనా బాధితులకు అండగా సెలబ్రెటీలు.. సీఎం సహాయనిధికి భారీగా విరాళాన్ని అందించిన విక్రమ్..

Vikram : యావత్ భారతాన్ని కరోనా రెండో దశ రూపంలో అతలాకుతలం చేస్తోంది. ప్రాణాల కోసం పోరాడుతున్న కరోనా బాధితులతో దేశంలోని అన్ని హాస్పిటల్స్ నిండిపోయాయి.

కరోనా బాధితులకు అండగా సెలబ్రెటీలు.. సీఎం సహాయనిధికి భారీగా విరాళాన్ని అందించిన విక్రమ్..
Vikram

Updated on: May 17, 2021 | 7:42 PM

Vikram : యావత్ భారతాన్ని కరోనా రెండో దశ రూపంలో అతలాకుతలం చేస్తోంది. ప్రాణాల కోసం పోరాడుతున్న కరోనా బాధితులతో దేశంలోని అన్ని హాస్పిటల్స్ నిండిపోయాయి. ఈ క్రమంలోనే ఈ మహమ్మారిని నియంత్రించడానికి ఆయా రాష్ట్రాలు పటిష్టమైన చర్యలు తీసుకోవడమే కాకుండా.. సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. ఇందులో భాగంగా.. సెలెబ్రెటీలు తమ రాష్ట్రా ప్రభుత్వాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ అండగా నిలుస్తున్నాయి. ఇక ఇందులో ముఖ్యంగా కరోనా బాధితుల కోసం బాలీవుడ్ , కోలీవుడ్ సెలబ్రెటీలు తమ రాష్ట్ర ప్రభుత్వానికి కరోనా నియంత్రణకు సాయం అందించడానికి ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి పలువురు స్టార్ హీరోలు, నిర్మాతలు భారీగా విరాళాలు అందజేస్తున్నారు.

కరోనాను నియంత్రించేందుకు ఇప్పటికే తమిళ స్టార్ హీరో సూర్య, కార్తీ, అజిత్, శివ కుమార్, రజినీకాంత్, శివ కార్తికేయన్.. స్టాలిన్ ప్రభుత్వానికి లక్షలలో విరాళాన్ని అందజేశారు. ఇక తాజాగా తమిళ మరో స్టార్ హీరో విక్రమ్ తమిళనాడు ప్రభుత్వానికి రూ. 30 లక్షల రూపాయాలు అందించారు. భారీ మొత్తంలో విక్ర‌మ్ విరాళాలు అందించ‌డంపై అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక సన్ టీవీ అధినేత కళానిధి మారన్ కూడా తమిళ ప్రభుత్వానికి పది కోట్ల రూపాయాలను సాయంగా అందించారు. తమిళనాడులో కరోనా కేసులు రోజు రోజుకీ గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో  ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది.

ట్వీట్…

Also Read: Priyanka Nick Jonas: షూటింగ్‏లో గాయపడ్డ ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్.. ఆసుపత్రిలో చేర్చిన సిబ్బంది..

Charmy Kaur: హీరోయిన్ నుంచి ప్రొడ్యూసర్‏గా మారిన ఛార్మి సినీ ప్రస్థానం… ఛార్మి కౌర్ పుట్టినరోజు నేడు..

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ సినిమాల్లో ఇప్పుడు ఏది ఎక్కడెక్కడుంది.?