AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Charmy Kaur: హీరోయిన్ నుంచి ప్రొడ్యూసర్‏గా మారిన ఛార్మి సినీ ప్రస్థానం… ఛార్మి కౌర్ పుట్టినరోజు నేడు..

Charmy Kaur: ఆడపులి, శివంగీ.. అంటూ తెరపై కుర్రకారు మదిని దోచింది.. ఛార్మికౌర్. 15 ఏళ్ల వయస్సులోనే ఇండస్ట్రీలోకి ‘నీ తోడు కావాలి’ సినిమాతో హీరోయిన్‌గా  అడుగుపెట్టిన ఈ బ్యూటీ..

Charmy Kaur: హీరోయిన్ నుంచి ప్రొడ్యూసర్‏గా మారిన ఛార్మి సినీ ప్రస్థానం... ఛార్మి కౌర్ పుట్టినరోజు నేడు..
Charmy
Rajitha Chanti
|

Updated on: May 17, 2021 | 3:49 PM

Share

Charmy Kaur: ఆడపులి, శివంగీ.. అంటూ తెరపై కుర్రకారు మదిని దోచింది.. ఛార్మికౌర్. 15 ఏళ్ల వయస్సులోనే ఇండస్ట్రీలోకి ‘నీ తోడు కావాలి’ సినిమాతో హీరోయిన్‌గా  అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. తన క్యూట్ స్మైల్ తో టాలీవుడ్ అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. లేటు వయస్సులో ప్రొడక్షన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మ.. అక్కడ కూడా హిట్స్ అందుకుంటుంది. ఇవాళ బర్త్ డే జరుపుకుంటున్న ఛార్మి కౌర్ సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందామా.

1987 మే 17న హైదాబాద్‌కు చెందిన పంజాబీ ఫ్యామిలీలో జన్మించిన ఛార్మి కౌర్ పేరుకు పంజాబీ పిల్ల అయినా.. తెలుగమ్మాయిలా గల గలా మాట్లాడే ఈ అమ్మడు.. టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్. చిన్న వయస్సులోనే సినిమాల్లోకి వచ్చినా.. శ్రీ ఆంజనేయంతో ఫస్ట్ హిట్ కొట్టింది. అందులో ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆ తర్వాత ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. మాస్ మూవీలో నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ప్రభాస్ తో చక్రం మూవీ చేసిన ఛార్మి.. ఆ తర్వాత అనుకోకుండా ఒకరోజులో అద్భుతంగా నటించింది. ఈ మూవీ అంతా తానొక్కరై నటించింది. ఇందులో నటనకు గాను ఛార్మి.. ప్రశంసలు అందుకుంది. మంగళ మూవీలో తన నటనకు ఛార్మికి నంది అవార్డు దక్కింది. తర్వాత బాపు కన్నుల్లో పడ్డ ఈ చిన్నది.. అచ్చమైన తెలుగమ్మాయిలా సుందరకాండ మూవీలో నటించి మెప్పించింది. తెలుగుతో పాటు.. సౌత్ లో అన్ని భాషల్లో నటించిన ఆమె.. బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చింది. జ్యోతిలక్ష్మీ మూవీతో ప్రొడ్యూసర్ గా మారిన ఛార్మి.. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ప్రొడక్షన్ లో వరుసగా మూవీస్ చేస్తుంది. అయితే ఇటీవలే ఛార్మి పెళ్లి చేసుకోబోతుందంటూ ఓ రూమర్ వైరల్ అయ్యింది. అంతలోనే ఇప్పట్లో తనకా ఉద్దేశ్యం లేదని సింపుల్ గా తేల్చిచెప్పింది. 34 ఏళ్లు పూర్తవుతున్నా.. మూడుముళ్లపై ముచ్చట లేదంటుంది ఛార్మి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో వస్తోన్న లైగర్ సినిమాను నిర్మిస్తుంది.

Also Read: PF ఖాతాదారులకు శుభవార్త.. ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం.. ఇక నుంచి ప్రతి నెల అకౌంట్‏లోకి డబ్బులు..

Follow Us
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు