విజయ్ వర్మ, తమన్నా.. ఈ మధ్య కాలంలో సౌత్, నార్త్ సినీ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న కపుల్ నేమ్స్. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ రూమర్స్ రావడం, ఆ వెంటనే వీరిద్దరి లిప్‌లాక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మ్యాటర్ మరింత హీట్ పెంచింది. చివరకు తాము రిలేషన్‌లో ఉన్నామంటూ అటు తమన్న, ఇటు విజయ్ వర్మ క్లారిటీ ఇచ్చేయడంతో.. అంతా కూల్ అయ్యింది.
ఇకపోతే తమన్నా మునుపెన్నడూ లేనంతగా బోల్డ్ సీన్‌లలో నటిస్తూ రచ్చ చేస్తోంది. సెక్స్ సీన్లలో నటిస్తూ అభిమానుల మతి పోగొడుతోంది. ఇప్పటికే ‘జీ కర్దా’ లో తమన్నా హాట్ సీన్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుండగా.. విడుదలకు సిద్ధంగా ఉన్న లస్ట్ స్టోరీస్ 2 మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. ఇందులో తమన్నా తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ సరసన నటించడం మరింత ఇంట్రస్ట్ పెంచింది.
తాజాగా ఓ ఇంటర్వయూలో మాట్లాడిన తమన్నా.. విజయ్ వర్మతో తన రిలేషన్‌పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘లస్ట్ స్టోరీస్-2’ లో విజయ్‌తో క్లోజ్ సీన్స్‌లో నటించడంపై తన అనుభవాలను పంచుకుంది. ‘నేను ఏ నటుడితోనూ ఇంత సెక్యూర్‌గా ఫీల్ అవ్వలేదు. సెక్యూర్, కంఫర్ట్ అనేది నటికి చాలా అవసరం. ఇలాంటి సినిమాల్లో సీన్లు చేయడం అంటే పెద్ద టాస్క్. ఏ డైలాగ్ చెప్పడానికైనా, ఏ సీన్ చేయడానికైనా సిద్ధపడేంత సేఫ్, కంఫర్ట్ ఫీలింగ్‌ను విజయ్ నాకు కల్పించాడు. విజయ్ తోడుగా ఉంటే.. పూర్తి భద్రతాభావంలో ఉంటాను.’ అని చెప్పుకొచ్చింది మిల్క్ బ్యూటీ. ‘విజయ్ నన్ను కంఫర్ట్‌గా, హ్యాపీగా ఉండేలా చూస్తాడు. అతనంటే చాలా ఇష్టం.’ అని చెప్పుకొచ్చింది తమన్న. విజయ్ కూడా ఓ ఇంటర్వ్యూ ఇవే కామెంట్స్ చేశాడు. తమన్నను హ్యాపీ ప్లేస్‌గా పేర్కొన్నాడు.
ఆర్ బాల్కీ దర్శకత్వం వహించిన ‘లస్ట్ స్టోరీస్-2’ జూన్ 29న ఒటిటి ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఇందులో కొంకణా సేన్, నీనా గుప్తా, కాజోల్, తమన్నా భాటియా, మృణాల్ ఠాకూర్, అంగద్ బేడీ, విజయ్ వర్మ సహా తదితరులు నటించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..