టాలీవుడ్ లో వరస ఆఫర్స్ అందుకుంటున్న టబు..!
దగ్గుబాటి రానా, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించబోతున్న చిత్రం ‘విరాట పర్వం’. పూర్తి రాజకీయ నేపధ్యంతో రూపొందించనున్న ఈ చిత్రం స్క్రిప్ట్ కు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు వేణు. ఇక జులై నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇకపోతే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ టబు నటించనుందట. ఇక ఈ సినిమాలో మానవ హక్కుల నేతగా ఆమె కనిపించనున్నట్లు వినికిడి. ఈ […]

దగ్గుబాటి రానా, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించబోతున్న చిత్రం ‘విరాట పర్వం’. పూర్తి రాజకీయ నేపధ్యంతో రూపొందించనున్న ఈ చిత్రం స్క్రిప్ట్ కు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు వేణు. ఇక జులై నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇకపోతే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ టబు నటించనుందట. ఇక ఈ సినిమాలో మానవ హక్కుల నేతగా ఆమె కనిపించనున్నట్లు వినికిడి. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో కూడా రిలీజ్ కానుందట. కాగా ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనుంది చిత్ర యూనిట్.