Taapsee Pannu : మిథాలీ థియేటర్లలోకి అడుగుపెట్టేది అప్పుడే..

|

Dec 04, 2021 | 1:59 PM

ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. అందులోనూ క్రీడాకారుల బయోపిక్‌లు ఎక్కువగా వస్తు్న్నాయి. ఇప్పటికే ధోనీ, మేరీకోమ్‌, అజహరుద్దీన్‌, సచిన్‌, మిల్కాసింగ్‌, సైనాల జీవితకథలతో రూపొందిన సినిమాలు సూపర్‌డూపర్‌

Taapsee Pannu : మిథాలీ థియేటర్లలోకి అడుగుపెట్టేది అప్పుడే..
Follow us on

ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. అందులోనూ క్రీడాకారుల బయోపిక్‌లు ఎక్కువగా వస్తు్న్నాయి. ఇప్పటికే ధోనీ, మేరీకోమ్‌, అజహరుద్దీన్‌, సచిన్‌, మిల్కాసింగ్‌, సైనాల జీవితకథలతో రూపొందిన సినిమాలు సూపర్‌డూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఈక్రమంలో బాక్సాఫీస్‌లో మరో స్టో్ర్ట్స్‌ స్టార్‌ బయోపిక్‌ రానుంది. భారత మహిళల క్రికెట్‌లో ‘లేడీ సచిన్’ అని గుర్తింపు పొందిన హైదరాబాదీ క్రికెటర్‌ ‘మిథాలీరాజ్‌’ జీవిత కథ సిల్వర్‌ స్ర్కీన్‌పై కనిపించనుంది. బాలీవుడ్‌లో మహిళా ప్రాధాన్య చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా పేరొందిన తాప్సీ పన్ను టైటిల్‌ రోల్‌ పోషిస్తోంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం ఎట్టకేలకు విడుదల కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది.

వయాకామ్‌ 18 స్టూడియోస్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్‌ త్రివేది సంగీతం సమకూరుస్తున్నారు. కాగా మిథాలీ పుట్టిన రోజు (డిసెంబర్‌3)ను పురస్కరించుకుని ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. ‘ఒక అమ్మాయి తన బ్యాట్‌తో మూస పద్ధతులతో పాటు క్రికెట్‌లోని రికార్డులను ఎలా బద్దలు కొట్టిందో ఈ సినిమాలో చూపించనున్నాం. ఆమె నిజమైన ఛాంపియన్‌. హ్యాపీ బర్త్‌డే ‘శభాష్‌ మిథూ’ అని ట్వి్ట్టర్‌లో పోస్ట్‌ చేసింది చిత్రబృందం. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో మిథాలీ ప్రస్థానం, సాధించిన రికార్డులను సిల్వర్‌ స్ర్కీన్‌పై చూసేందుకు క్రీడాభిమానులతో పాటు సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

RRR Movie: ఆ సన్నివేశంపై మరింత శ్రద్ద పెట్టి షూట్ చేసిన జక్కన్న.. ఫ్యాన్స్‌కు పూనకాలేనట..

Deepika padukone: ‘చూపులు గుచ్చుకోవడం అంటే ఇదేనేమో’.. హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన వాలు కళ్ల వయ్యారి

Bellamkonda Sreenivas: శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న బెల్లంకొండ ‘ఛత్రపతి’ రీమేక్..