ట్రైలర్ టాక్ : ఫైర్ బ్రాండ్ ‘సూర్యకాంతం’

ట్రైలర్ టాక్ : ఫైర్ బ్రాండ్ 'సూర్యకాంతం'

రాహుల్ విజయ్, నిహారిక కొణిదెల హీరోహీరోయిన్లుగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘సూర్యకాంతం’. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందినట్లు తెలుస్తోంది. ఇక ట్రైలర్ లోనే కథను దాదాపుగా రివీల్ చేసేశారు. అభి(రాహుల్ విజయ్)కు అనుకోని పరిస్థితులలో సూర్యకాంతం(నిహారిక) పరిచయమవుతుంది. చలాకీతనం, చిలిపితనం, ముక్కుసూటితనం కలిగి ఉన్న సూర్యకాంతం గురించి అభికి ఏమి తెలియదు. […]

Ravi Kiran

|

Mar 26, 2019 | 5:11 PM

రాహుల్ విజయ్, నిహారిక కొణిదెల హీరోహీరోయిన్లుగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘సూర్యకాంతం’. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందినట్లు తెలుస్తోంది. ఇక ట్రైలర్ లోనే కథను దాదాపుగా రివీల్ చేసేశారు. అభి(రాహుల్ విజయ్)కు అనుకోని పరిస్థితులలో సూర్యకాంతం(నిహారిక) పరిచయమవుతుంది. చలాకీతనం, చిలిపితనం, ముక్కుసూటితనం కలిగి ఉన్న సూర్యకాంతం గురించి అభికి ఏమి తెలియదు. కానీ తన మీద ఇష్టాన్ని పెంచుకుంటాడు.

అయితే కొద్దిరోజుల తర్వాత అభికి పూజా(పెర్లెన్) అనే అమ్మాయితో ప్రేమ మొదలవుతుంది. కానీ అప్పుడే అనుకోని ట్విస్ట్ లా సూర్యకాంతం మళ్ళీ అభి జీవితంలోకి వస్తుంది. సో అప్పుడు అభి వీరిద్దరి మధ్య ఇరుక్కుపోతాడు. మరి ఈ ప్రేమ యుద్ధంలో సూర్యకాంతం గెలిచిందా.. లేక పూజ గెలిచిందా అనేది వెండి తెరపై చూడాలి.

ట్రైలర్ చూస్తుంటే దర్శకుడు ప్రణీత్ ఎంటర్టైన్మెంట్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. చక్కని కామెడీ కూడా కంటెంట్ కు తోడైంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మార్క్ రాబిన్ చక్కని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.  కాగా ట్రైలర్ చివర్లో నిహారిక చెప్పే డైలాగు బాగుంటుంది. ఏది ఏమైనా ట్రైలర్ లో ఉన్న కంటెంట్ పూర్తి సినిమాలో ఉంటే… నిహారిక కు మొదటి హిట్ గ్యారంటీ. ఆలస్యం ఎందుకు మీరు కూడా ఒకసారి ట్రైలర్ ను లుక్కేయండి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu