‘ఆకాశమే నీ హద్దురా’ అదుర్స్.. తెలుగులో సూర్య రేంజ్ మళ్లీ పెరిగినట్లేనా.!
గజినీ.. సౌత్‌లో సూర్యను దాదాపు సూపర్ స్టార్ స్థాయికి చేర్చిన మూవీ. తమిళ్ వెర్షన్‌తో పోటీపడి తెలుగు వెర్షన్ కూడా కాసుల పంట కురిపించింది.
Aakasame Ne Haddu ra: గజినీ.. సౌత్‌లో సూర్యను దాదాపు సూపర్ స్టార్ స్థాయికి చేర్చిన మూవీ. తమిళ్ వెర్షన్‌తో పోటీపడి తెలుగు వెర్షన్ కూడా కాసుల పంట కురిపించింది. ఇందులో సూర్య చేసిన డ్యూయల్ పెర్ఫామెన్స్.. అప్పట్లో ఒక ట్రెండ్‌సెట్ చేసింది. మురుగదాస్‌ని స్టార్ డైరెక్టర్‌గా మార్చిన మూవీ కూడా అదే. హిందీలో మరో స్టార్ హీరో చేసినా.. సూర్యకొచ్చినంత హైప్ రాలేదు. దాదాపు 12 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ గజినీ డేస్‌ని గుర్తు చేస్తున్నాడు హీరో సూర్య.
‘ఆకాశం నీ హద్దురా’ మూవీ చూసిన క్రిటిక్స్.. సూర్యకిస్తున్న కాంప్లిమెంట్స్.. గజినీ రేంజ్ ని రీకాల్ చేస్తున్నాయి. చాలా గ్యాప్ తర్వాత సూర్య బ్లాక్ బస్టర్ ని టేస్ట్ చేస్తున్నారని, ఈ మూవీకి సూర్య యాక్టింగే మేజర్ హైలైట్ అని పొగిడేస్తున్నారు. సుధా కొంగర డైరెక్ట్ చేసిన ఈ మూవీ.. ఓటీటీలో రిలీజైనా.. మెయిన్ థియేటర్ రిలీజ్ కొస్తున్నంత రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. ముఖ్యంగా సూర్య ఈజ్ బ్యాక్ అనే సౌండ్ నిస్తోంది.. ఆకాశం నీ హద్దురా.
సూర్య కెరీర్లో ఘజిని తర్వాత కొన్ని మంచి సినిమాలు పడినా.. ఆయనకు ఇదే బెస్ట్ కమ్ బ్యాక్ మూవీ అని సర్టిఫై చేస్తున్నాయి ఫస్ట్ రివ్యూలు. ఘజినిని మించి పెర్ఫామెన్స్ చూపించారని.. యాక్టర్ గా సూర్యకిది పునర్జన్మ అని చెబుతున్నారు. సెవెంత్ సెన్స్, 24 లాంటివన్నీ క్లాసికల్స్ గా నిలబడ్డాయి తప్ప.. కమర్షియల్ సక్సెస్ అనిపించుకోలేదు. NGK లాంటి మరికొన్ని సినిమాలు సూర్య మార్కెట్ ని తెలుగులో బాగా తగ్గించేశాయి. ఇప్పుడు ‘ఆకాశం నీ హద్దురా’ మూవీ పేరుకు తగ్గట్లే.. సూర్యకు టాలీవుడ్ లో కూడా మంచి బేస్ వేస్తుందన్నది ఒక అంచనా.
Also Read:
మెగాస్టార్ చిరంజీవికి కరోనా నెగటివ్.. కాలం, కరోనా నన్ను కన్ఫ్యూజ్ చేశాయంటూ ట్వీట్..
పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పరీక్షలపై కీలక నిర్ణయం.!
రైలు ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. 12 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. వివరాలివే..!
ఏపీ: సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్.. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ గడువు పొడిగింపు..
కూతురు పుట్టింది.. అదృష్టాన్ని తెచ్చింది.. మురిసిపోతున్న యువ పేసర్ నటరాజన్..