‘ఆహా’ గేమ్ ఛేంజర్‌, మున్ముందు మరింత గొప్ప కంటెంట్‌తో మీ ముందుకు వస్తాం : రాము జూపల్లి

తెలుగులో ఇప్పుడు ‘ఆహా’ సంచలనంగా మారింది. అదిరిపోయే కంటెంట్‌తో దూసుకుపోతుంది.  సరికొత్త కాన్సెప్ట్‌తో కూడిన సినిమాలు, వెబ్ సిరీస్‌తో రోజురోజుకీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతోంది.

'ఆహా’ గేమ్ ఛేంజర్‌, మున్ముందు మరింత గొప్ప కంటెంట్‌తో మీ ముందుకు వస్తాం :  రాము జూపల్లి
Follow us

|

Updated on: Nov 13, 2020 | 8:42 PM

తెలుగులో ఇప్పుడు ‘ఆహా’ సంచలనంగా మారింది. అదిరిపోయే కంటెంట్‌తో దూసుకుపోతుంది.  సరికొత్త కాన్సెప్ట్‌తో కూడిన సినిమాలు, వెబ్ సిరీస్‌తో రోజురోజుకీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతోంది. మొట్టమొదటి తెలుగు ఓటీటీ ‘ఆహా’ ను వీక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇప్పటికే 18 మిలియన్ల యూజర్స్, 6 మిలియన్ల డౌన్‌లోడ్స్‌తో రికాార్డు సృష్టించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో అదిరిపోయే దీపావళి ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆహా సీఈవో అజిత్ ఠాకూర్, మై హోమ్ గ్రూఫ్ కంపెనీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ‘ఆహా’ ప్రమోటర్ రాము జూపల్లి, వంశీపైడిపల్లి, శరత్ మరార్, దిల్ రాజు  తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మై హోమ్ గ్రూఫ్ కంపెనీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాము జూపల్లి మాట్లాడారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందర్నీ ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు.  ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే ‘ఆహా’ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో గేమ్ ఛేంజర్‌గా మారిందని పేర్కొన్నారు. తన తండ్రి రామేశ్వరరావు గారు ఏ రంగంలోకి వెళ్లినా మొదటి స్థానంలో ఉంటారని..ఆయనే తనకు స్ఫూర్తి అని వెల్లడించారు.  రాబోయే రోజుల్లో మరింత ఎగ్జైటింగ్ స్టఫ్‌తో ‘ఆహా’ వీక్షకులను అలరిస్తోందని హామి ఇచ్చారు. త్వరలో విదేశాల్లో సైతం ‘ఆహా’ను మరింత విస్తరింపచేస్తామని చెప్పారు. రోజురోజుకి సబ్ స్క్రైబర్స్ పెరగడమనేది తమపై బాధ్యతను మరింత పెంచుతోందని.. కచ్చితంగా తెలుగు ప్రేక్షకులను మరింత అలరించే కంటెంట్‌తో ‘ఆహా’ రెడీ అవుతుందని పేర్కొన్నారు.

హిమపాతాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా.. ఈ ప్లేసెస్ బెస్ట్ ఎంపిక
హిమపాతాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా.. ఈ ప్లేసెస్ బెస్ట్ ఎంపిక
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. ఏమన్నారంటే?
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. ఏమన్నారంటే?
IND vs AUS: టాస్ గెలిచిన ఆసీస్.. భారత ప్లేయింగ్ 11 కీలక మార్పు..
IND vs AUS: టాస్ గెలిచిన ఆసీస్.. భారత ప్లేయింగ్ 11 కీలక మార్పు..
యువనేతలకు ఓటర్ల పట్టం.. పిన్న వయసులోనే అసెంబ్లీకి..
యువనేతలకు ఓటర్ల పట్టం.. పిన్న వయసులోనే అసెంబ్లీకి..
వెకేషన్‏కు వరుణ్ లవ్.. సిల్వర్ శారీలో మాళవిక హోయలు..
వెకేషన్‏కు వరుణ్ లవ్.. సిల్వర్ శారీలో మాళవిక హోయలు..
ఇంటి గోడలను తినేస్తున్న స్త్రీ.. నోఎంట్రీ బోర్డు పెట్టిన పొరుగు
ఇంటి గోడలను తినేస్తున్న స్త్రీ.. నోఎంట్రీ బోర్డు పెట్టిన పొరుగు
రాజకీయాలు, జీవితంలో గెలుపోటమిలు సర్వసాధారణం : కేటీఆర్
రాజకీయాలు, జీవితంలో గెలుపోటమిలు సర్వసాధారణం : కేటీఆర్
రైతుబిడ్డకు బంపరాఫర్‌.. పవన్‌ కల్యాణ్‌ సినిమాలో పల్లవి ప్రశాంత్‌
రైతుబిడ్డకు బంపరాఫర్‌.. పవన్‌ కల్యాణ్‌ సినిమాలో పల్లవి ప్రశాంత్‌
తెలంగాణలో గెలిచిన కొత్త ఎమ్మెల్యేలు వీరే..!
తెలంగాణలో గెలిచిన కొత్త ఎమ్మెల్యేలు వీరే..!
రూ.3 కోట్లు ఇస్తారా కేసు పెట్టమంటారా? మైక్ టైసన్‌ కొత్త తలనొప్పి.
రూ.3 కోట్లు ఇస్తారా కేసు పెట్టమంటారా? మైక్ టైసన్‌ కొత్త తలనొప్పి.