నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన చింత్రం దసరా. మార్చి 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామిని సృష్టిస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది. తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తెలంగాణ నేపథ్యంలో పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో నాని, కీర్తి సురేష్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. శ్రీకాంత్ ఓదెల సినిమాను తెరకెక్కించిన తీరును ప్రశంసిస్తున్నారు.
దసరా సినిమా కలెక్షన్ల విషయానికొస్తే విడుదలైన రెండు రోజుల్లో ఏకంగా రూ. 53 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు దసరాను పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారు. ముఖ్యంగా నాని, కీర్తి సురేష్‌ల నటనతో పాటు దర్శకుడు ప్రతిభకు మంచి మార్కులు వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వచ్చి చేరారు.
So so proud of #Dasara!! Stunning cinema! ??@NameisNani @KeerthyOfficial @Dheekshiths @thondankani @odela_srikanth @Music_Santhosh @NavinNooli @sathyaDP
— Mahesh Babu (@urstrulyMahesh) March 31, 2023
దసరా చిత్రంపై మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. ‘దసరా విషయంలో చాలా గర్వంగా ఉంది. సినిమా అద్భుతంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇక మహేష్ చేసిన ఈ ట్వీట్‌కు చిత్ర యూనిట్ బదులిచ్చింది. సూపర్ స్టార్‌కు ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చింది. ఇదిలా ఉంటే దసరా మూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎంతో భారీ స్థాయిలో రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, సత్యన్ సూర్యన్ కెమెరా మ్యాన్‌గా పని చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..