Mahesh Babu: సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి మహేష్ బాబు దంపతులు.. సూపర్‌స్టార్ లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారు. ఈ సందర్భంగా మహేష్ బాబు దంపతులు ముఖ్యమంత్రి సహాయనిధికి భారీగా రూ.50 లక్షల విరాళం అందజేశారు. తెలంగాణలో ఇటీవల వచ్చిన భారీ వర్షాలు, వరదల వల్ల పలు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అపార నష్టం వాటిల్లింది.. పంటలు నీటమునిగాయి..
సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారు. ఈ సందర్భంగా మహేష్ బాబు దంపతులు ముఖ్యమంత్రి సహాయనిధికి భారీగా రూ.50 లక్షల విరాళం అందజేశారు. తెలంగాణలో ఇటీవల వచ్చిన భారీ వర్షాలు, వరదల వల్ల పలు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అపార నష్టం వాటిల్లింది.. పంటలు నీటమునిగాయి.. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.. దీంతో పునరావాస కార్యక్రమాలకు ప్రభుత్వం విస్తృతంగా కృషిచేసింది.. అంతేకాకుండా విపత్తు నుంచి బయటపడేందుకు సాయం అందించాలని కోరింది.. అయితే.. విపత్తు సమయంలో పునరావాస కార్యక్రమాలకు, సహాయం అందించేందుకు పలువురు ప్రముఖులు, టాలీవుడ్ హీరోలు ముందుకొచ్చారు. వరద సహాయాన్ని అందించేందుకు మహేష్ బాబు సైతం స్పందించి ముందుకు వచ్చారు. వరదల సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి చెరొక 50 లక్షల చొప్పున సాయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ దంపతులు రేవంత్ రెడ్డిని కలిసి రూ.50లక్షల చెక్కును అందజేశారు.
వీడియో చూడండి..
రూ.50 లక్షలతో పాటు, ఆయన నిర్వహిస్తున్న AMB సినిమాస్ తరపున కూడా మరో రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహేష్ బాబు దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. “ఇలాంటి సమయంలో సినీ నటులు కూడా తమ వంతు సహాయాన్ని అందించడంలో ముందుండటం గర్వకారమని.. మహేష్ నమ్రత దంపతులను అభినందించారు. మహేష్ బాబు చేసిన ఈ సహాయం పునరావాస కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ రోజు ప్రముఖ సినీ నటుడు శ్రీ జి.మహేష్ బాబు దంపతులు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు విరాళం అందజేశారు. AMB తరపున మరో రూ.10 లక్షల విరాళం అందజేశారు. వారికి నా అభినందనలు.@urstrulyMahesh pic.twitter.com/BcIIJNpmA1
— Revanth Reddy (@revanth_anumula) September 23, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.