ఈ సమస్యలున్న వారు క్యారెట్లు తిన్నారో కొంప కొల్లేరే!

17 December 2024

TV9 Telugu

TV9 Telugu

వయసు పెరిగేకొద్దీ ఆరోగ్య సమస్యలు దాడి చేస్తుంటాయి. ఆరోగ్యంతోపాటు అందం పోషణలోనూ క్యారెట్లు బలేగా పనిచేస్తాయి. ఈ సమస్యలన్నింటికీ క్యారెట్‌ మంచి పరిష్కారమంటున్నారు నిపుణులు

TV9 Telugu

క్యారెట్‌లో ఎ, కె, బి6 విటమిన్లు, బయోటిన్‌, మినరల్స్‌, బీటా కెరొటిన్‌ గుణాలెక్కువ. దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే మధుమేహ ప్రమాదమండదు. పీచు యాసిడ్లను అదుపులో ఉంచడమే కాదు.. అజీర్తినీ నిరోధిస్తుంది

TV9 Telugu

దీనిలో ఉండే కెరొటినాయిడ్స్‌, బయోయాక్టివ్‌ ఫ్లెవనాయిడ్లు కణాల ఆరోగ్యానికి చాలామంచిది. నేరుగా తీసుకున్నా, ఉడికించి తీసుకున్నా చర్మానికి మంచిదే. విటమిన్‌ ఎ.... కణాలు, కొలాజెన్‌ ఉత్పత్తికీ సాయపడుతుంది

TV9 Telugu

తక్కువ హిమోగ్లోబిన్ ఉన్నవారు జలుబు సమయంలో క్యారెట్, బీట్‌రూట్ వంటి కూరగాయల జ్యూస్‌ తాగితే ఉపశమనం లభిస్తుంది.  అయితే ఇవి ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్న వారు వీటిని అస్సలు తినకూడదు

TV9 Telugu

కడుపు నొప్పిగా ఉంటే క్యారెట్ తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో గరిష్టంగా ఫైబర్ఉంటుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి ఇది అవసరం. కానీ పొట్టకు పీచు ముఖ్యమే అయినా జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది

TV9 Telugu

విరేచనాలు, వాంతులు సంభవించినప్పుడు, కడుపు బలహీనంగా మారుతుంది. ఇలాంటి సమయంలో క్యారెట్‌ను జీర్ణం చేయడం సులభం కాదు. అందుకే తినకూడదు

TV9 Telugu

మధుమేహ వ్యాధిగ్రస్తులు క్యారెట్ జ్యూస్ తాగే ముందు నిపుణులను సంప్రదించాలి. ఇది సహజ చక్కెరను కలిగి ఉన్నందున, రక్తంలో చక్కెర స్థాయి పెరగవచ్చు

TV9 Telugu

అలాగే ఆరోగ్యంగా ఉండేందుకు కొందరు క్యారెట్లను ఎక్కువగా తీసుకుంటారు. పీచు ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం సమస్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకంతో బాధపడేవారు ఒకటి లేదా రెండు క్యారెట్లను మాత్రమే తినాలి