‘దొరసాని’ వేడుకలో రౌడీ కన్నీరు!

ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘దొరసాని’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సీనియర్ హీరో రాజశేఖర్‌తో పాటు రౌడీ విజయ్ దేవరకొండ ముఖ్య అతిధిగా విచ్చేశాడు. నిత్యం సంతోషంగా, సరదాగా ఉండే విజయ్ తన తమ్ముడి గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఆనంద్.. ఇంటికి డబ్బు పంపి మమ్మల్ని ఆదుకున్నాడు. ఆ జాబ్‌ను వదిలేసి సినిమాల్లోకి వస్తాననప్పుడు నేను వద్దన్నాను. సినిమాల్లో […]

'దొరసాని' వేడుకలో రౌడీ కన్నీరు!


ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘దొరసాని’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సీనియర్ హీరో రాజశేఖర్‌తో పాటు రౌడీ విజయ్ దేవరకొండ ముఖ్య అతిధిగా విచ్చేశాడు. నిత్యం సంతోషంగా, సరదాగా ఉండే విజయ్ తన తమ్ముడి గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఆనంద్.. ఇంటికి డబ్బు పంపి మమ్మల్ని ఆదుకున్నాడు. ఆ జాబ్‌ను వదిలేసి సినిమాల్లోకి వస్తాననప్పుడు నేను వద్దన్నాను. సినిమాల్లో నటించడం అంత ఈజీ కాదని చెప్పాను. ఈ సినిమా కోసం నా తమ్ముడికి ఒక్క సాయం కూడా చేయలేదు అంటూ విజయ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘దొరసాని’ చిత్రాన్ని వేడుకకు వచ్చే ముందే చూశానని అద్భుతంగా తీర్చిదిద్దారని విజయ్ దేవరకొండ తెలిపాడు.

శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు మహేంద్ర తెరకెక్కిస్తున్నాడు. యష్ రంగినేని, మధుర శ్రీధర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ జూలై 12న విడుదల కానుంది.

Click on your DTH Provider to Add TV9 Telugu