Radhe Shyam: రాధేశ్యామ్‌ స్లోగా ఉందన్న వారికి.. అదిరిపోయే పంచ్‌ ఇచ్చిన థమన్‌.. వైరల్‌ అవుతోన్న మీమ్‌..

Radhe Shyam: ప్రభాస్‌, పూజా హెగ్డేలు (Prabhas, Pooja Hegde) జంటగా తెరకెక్కిన రాధేశ్యామ్‌ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది...

Radhe Shyam: రాధేశ్యామ్‌ స్లోగా ఉందన్న వారికి.. అదిరిపోయే పంచ్‌ ఇచ్చిన థమన్‌.. వైరల్‌ అవుతోన్న మీమ్‌..
Thaman Radhe Shyam

Updated on: Mar 11, 2022 | 9:15 PM

Radhe Shyam: ప్రభాస్‌, పూజా హెగ్డేలు (Prabhas, Pooja Hegde) జంటగా తెరకెక్కిన రాధేశ్యామ్‌ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. దాదాపు అన్ని రివ్వ్యూలు సినిమాకు పాజిటివ్‌గానే వస్తున్నాయి. అయితే ఇదే సమయంలో సినిమా ఆశించిన స్థాయిలో లేదనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో వేదికగా రాధేశ్యామ్‌పై పలు రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. వీటిలో ప్రధానమైంది సినిమా కొంచెం స్లోగా ఉంది, బోర్‌గా ఉంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలా రాధేశ్యామ్‌ చిత్రంపై పలు నెగిటివ్‌ కామెంట్స్‌ కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఇలాంటి ఓ నెగిటివ్‌ పాయింట్‌పైనే సంగీత దర్శకుడు తమన్‌ తనదైన శైలిలో పంచ్‌ ఇచ్చారు. ఓ ఆసక్తికరమైన మీమ్‌ను పోస్ట్‌ చేస్తూ సినిమాపై నెగిటివ్‌ కామెంట్ చేస్తున్న వారికి అదిరిపోయే పంచ్‌ ఇచ్చారు.

వెంకీ సినిమాలో బ్రహ్మానందం సన్నివేశాన్ని మీమ్‌గా క్రియేట్‌ చేసిన ఫోటోను ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు థమన్‌. ఇందులో సినిమా ఎలా ఉందనగా.. బాగా స్లోగా ఉందని సమాధానం చెబుతోంది. దీంతో అవతల బ్రహ్మానందం రిప్లై ఇస్తూ.. ‘నేను అడిగింది బాగుందా? బాలేదా? అని!, లవ్‌ స్టోరీ స్లోగా కాకుండా ఫస్ట్‌ హాఫ్‌లో ఫస్ట్‌ నైట్‌, సెకండాఫ్‌లో సెకండ్‌ సెటప్‌ పెట్టాలా ఏంటి?’ అని ఉన్న సదరు మీమ్‌ను పోస్ట్‌ చేసిన థమన్‌.. ‘స్లో అంటే.. నువ్వు పరిగెత్తాల్సింది. మీమ్‌ అదిరింది’ అంటూ పంచ్‌ ఇచ్చారు. అంతేకాకుండా ‘బ్లాక్‌ బస్టర్‌ రాధేశ్యామ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను సైతం పోస్ట్‌ చేశారు థమన్‌. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది.

Also Read: Viral Video: ఈ తిమింగలం వెరీ స్పెషల్ గురూ.. అడిగి మరీ ముద్దు పెట్టించుకుంటుంది..!

Viral Photo: అట్లుంటది మనతోని.. ఈ ఫోటోలోని పామును కనిపెడితే మీరే తోపు.. కష్టం కాదండోయ్!

Flying Object: క్రొయేషియాలో కుప్పకూలిన వింత వస్తువు.. కూలిన చోట భారీ గొయ్యి.. UFO అంటూ అనుమానాలు..!