ప్రముఖ నటి, మోడల్ సోఫియా లియోన్ (26) తన అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించింది. ఈ షాకింగ్ ఘటన మార్చి 1న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలగులోకి వచ్చింది. ఈ మేరక ఆమె మరణ వార్తలను సోఫియా సవతి తండ్రి మైక్ రొమెరో వెల్లడించారు. ఆమె మరణానంతరం చేపట్టాల్సిన కార్యక్రమాల కోసం వివారాళాలు సేకరించడం కోసం ఈ వివరాలను రొమెరో గోఫండ్‌మిలో పొందుపరిచారు. బరువైన హృదయంతో సోఫియా ఇక లేరన్న వార్తను పంచుకుంటున్నానని ఆయన తెలిపారు. సోఫియా మృతితో ఆమె కుటుంబం దిక్కుతోచని స్ధితిలో ఉందని, ఆర్ధికంగానూ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు రొమెరో పేర్కొన్నారు. దాతల విరాళాలు ఆమె అంత్యక్రియలకు, కుటుంబ ఆర్ధిక కష్టాలకు చేయూత ఇచ్చినట్లు అవుతుందని రొమెరో గోఫండ్‌మిలో రాసుకొచ్చారు. సోఫియా మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సోఫియా మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
కాగా సోఫియా లియోన్ జూన్ 10, 1997న USAలోని మయామిలో జన్మించింది. 18 సంవత్సరాల వయస్సులోనే అడల్ట్ నటిగా సినీ కెరీర్ ప్రారంభించింది. ఇప్పటి వరకూ 80కి పైగా చిత్రాలలో నటించింది. సోఫియా హఠాన్మరణంతో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు శోకసంద్రంలో మునిగపోయారు. అమెరికాలో కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఇది మూడో అడల్ట్ ఫిల్మ్ స్టార్ మరణం కావడం చర్చణీయాంశంగా మారింది. గత నెల కాగ్నీ లిన్ కార్టర్ అనే మరో అడల్ట్ స్టార్ నటి కేవలం 36 ఏళ్ల వయసులోనే మృతి చెందింది. ఈ షాకింగ్ న్యూస్ ఆమె అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఓహియోలోని పర్మాలోని ఆమె నివాసంలో కాగ్నీ లిన్ కార్టర్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె అంత్యక్రియలకు ఆమె స్నేహితులు గోఫండ్‌మీలో క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించారు.
ఇక ఇదే ఏడాది జనవరిలో ప్రముఖ అడల్ట్ సినీ నటి జెస్సీ జేన్ డ్రగ్ ఓవర్ డోస్ కారణంగా 43 యేళ్ల వయస్సులో మృతి చెందింది. మరో అడల్ట్ ఫిల్మ్ స్టార్ ఎమిలీ విల్లీస్ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. అమెరికాలో చోటు చేసుకుంటున్న అడల్ట్ నటీమణుల వరుస మరణాలు పలు అనుమానాలకు తావిస్తోంది.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.