Skylab Movie: స్కైలాబ్‌ భూమ్మీద పడుతుందని ఊరంతా లొల్లి లొల్లి… ఆకట్టుకుంటోన్న నయా టీజర్‌..

|

Dec 02, 2021 | 1:53 PM

Skylab Movie: నిత్య మీనన్‌, సత్యదేవ్‌ ప్రధాన పాత్ర దారులుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా స్కైలాబ్‌. 1979లో జరిగిన స్కైలాబ్‌ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్కైలాబ్‌ స్పేస్‌ షటిల్‌ భూమ్మీద పడుతుందనే...

Skylab Movie: స్కైలాబ్‌ భూమ్మీద పడుతుందని ఊరంతా లొల్లి లొల్లి... ఆకట్టుకుంటోన్న నయా టీజర్‌..
Follow us on

Skylab Movie: నిత్య మీనన్‌, సత్యదేవ్‌ ప్రధాన పాత్ర దారులుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా స్కైలాబ్‌. 1979లో జరిగిన స్కైలాబ్‌ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్కైలాబ్‌ స్పేస్‌ షటిల్‌ భూమ్మీద పడుతుందనే భయానికి ఆ కాలం నాటి ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారన్న విషయాలకు కామెడీని జోడించి సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ఈ చిత్రంలో నిత్య మీనన్‌ జర్నలిస్ట్‌ పాత్రలో నటిస్తోంది. ఇక ఓవైపు ప్రజలంతా భయంతో బిక్కుబిక్కుమంటుంటే ఆ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని ఎలా లాభపడ్డాడన్న పాత్రలో సత్యదేవ్‌ నటించాడు. 1979లో తెలంగాణలోని బండలింగంపల్లి గ్రామంలో జరిగిన సన్నివేశాలను ఇతివృత్తంగా చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 4న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, పోస్టర్‌లు సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. 1970నాటి రోజులను దర్శకుడు ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ మరో సర్‌ప్రైజ్‌ను ఇచ్చింది. చిత్రానికి సంబంధించి కొత్త టీజర్‌ను విడుదల చేసింది. 48 సెకన్ల నిడివితో ఉన్న టీజర్‌ చిత్రంపై అంచనాలను పెంచేసింది. స్కైలాబ్‌ స్పేస్‌ షటిల్‌ భూమిపై పడుతుందన్న వార్తలు వచ్చిన సమయంలో ప్రజలు ఎలా రియాక్ట్‌ అయ్యారు, ఈ సమయంలో చోటుచేసుకున్న కామెడీ సన్నివేశాలను దర్శకుడు బాగా చూపించాడు. మరి టీజర్‌లతో అంచనాలు పెంచేసిన స్కైలాబ్‌ ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

అసలేంటీ స్కైలాబ్‌..

1979లో జరిగిన స్కైలాబ్‌ ఘటన ఇప్పటికే ఆ తరం వారికి గుర్తుండే ఉంటుంది. అమెరికా అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించి స్కైలాబ్‌ అనే స్పేస్‌ షటిల్‌ 24 వారాల పాటు పనిచేసి తర్వాత అంతరిక్ష కక్ష్య నుంచి భూవాతావరణంలోకి ప్రవేశించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్కైలాబ్‌ భూమ్మీద పడితే అంతా వినాశనమే అని నమ్మిన జనాలు ఉన్నది లేనిది అంతా అమ్ముకున్నారు. అయితే ఇదేది జరగలేదు భూ క్షక్ష్యలోకి ప్రవేశించిన స్కైలాబ్‌ విచ్ఛిన్నమై శకలాలు హిందూ మహా సముద్రంలో పడ్డాయి. దీంతో ప్రజంలతా ఊపిరి పీల్చుకున్నారు. అప్పట్లో మీడియా ఇంతలా ప్రాచుర్యంలో లేకపోవడంతో ప్రజలకు సమాచారం అందక ఏదేదో ఊహించుకున్నారు.

Also Read: Telangana: వేసింది పవిత్ర హనుమాన్‌ మాల.. చేస్తోంది మాత్రం నీచపు క్రీడ

Kajal Aggarwal: ఎర్ర కలువ పూవులా మెరిసిపోతున్న చందమామ.. కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫొటోస్..

Jagananna Housing Scheme: పేదలకు పూర్తి హక్కులు కల్పించే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం.. డిసెంబర్ 21న సీఎం జగన్ శ్రీకారం!