Singer Neha kakkar: స్టేజీపైనే ఏడ్చేసిన బాలీవుడ్ సింగర్ నేహా.. ఆ క్షణం నా జీవితాన్నే మార్చేసిందంటూ..
కొంత కాలంగా ప్రేమించుకొని ఇటీవలే వైవాహిక జీవితంలోకి అండుగుపెట్టారు బాలీవుడ్ సింగర్లు నేహా కక్కర్ మరియు రోహన్ ప్రీత్ సింగ్. వివాహం తర్వాత తమ ఫోటోలను షేర్ చేస్తూ
కొంత కాలంగా ప్రేమించుకొని ఇటీవలే వైవాహిక జీవితంలోకి అండుగుపెట్టారు బాలీవుడ్ సింగర్లు నేహా కక్కర్ మరియు రోహన్ ప్రీత్ సింగ్. వివాహం తర్వాత తమ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది ఈ జంట. తాజాగా వీరిద్దరు కలిసి ఇండియన్ ఐడల్ సీజన్ 12 షోకు వెళ్ళారు. అక్కడ రోహన్.. తన జీవితంలో నేహా రాకను.. తను వచ్చాక తను ఎలా మారిపోయానని చెప్తూ ఎమోషనల్ అయ్యారు. దీంతో అక్కడున్న జడ్జిలతోపాటు, నేహా కూడా కంటితడి పెట్టుకున్నారు.
రోహన్ మాట్లాడుతూ.. నేను తలపాగా కట్టుకుంటున్న సమయంలో నేహా మేనేజ్మెంట్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఆమె తర్వాత సాంగ్లో నటిస్తారా ? అని.. అందుకు మీరు ప్రత్యేకంగా అడగాలా ? అని బదులిచ్చాను. ఆ తర్వాత రోజు నేను నేహా గదిలోకి వెళ్ళగానే.. తను నన్ను చూసింది. ఆ క్షణం నా జీవితాన్నే మార్చేసింది. ఆమె నేహు కా వ్యాహ్ అనే పాట రాయడంతోపాటు, నా తలరాతను కూడా మార్చేసింది. ఇలా మీ ముందు స్జేజీపై నిలబడటానికి కారణం నేహానే అని గర్వంగా చెప్పుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో నేహా కక్కర్తో సహా అక్కడున్న జడ్జిలు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా గతేడాది అక్టోబర్ 24న నేహా కక్కర్ మరియు రోహాన్ ప్రేమవివాహం చేసుకున్నారు.
View this post on Instagram
Also Read: Rakul Preet Singh : మరో బాలీవుడ్ అవకాశాన్ని దక్కించుకున్న రకుల్ ప్రీత్.. మరోసారి ఆ యంగ్ హీరోతో
పంజా వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ‘ఉప్పెన’ ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడేనా..?