Shruti Haasan: హీరోలపై శృతిహాసన్ బోల్డ్ కామెంట్స్, కొత్తగా ట్రై చేయాలంటూ స్టేట్ మెంట్!
శ్రుతి హాసన్ చాలా విషయాల గురించి బహిరంగంగా మాట్లాడుతుంది. ఆమె తన వ్యక్తిగత విషయాలు, ఆరోగ్య సమస్యలు, కెరీర్ గురించి చాలాసార్లు బహిరంగంగానే మాట్లాడుతుంది. అంతేకాదు ఏవిషయంపైనైనా బోల్డ్ కామెంట్స్ చేయడానికి వెనుకడగు వేయదు. కుండబద్దలు కొట్టేలా మాట్లాడగలదు.

Shruti Haasan: శ్రుతి హాసన్ చాలా విషయాల గురించి బహిరంగంగా మాట్లాడుతుంది. ఆమె తన వ్యక్తిగత విషయాలు, ఆరోగ్య సమస్యలు, కెరీర్ గురించి చాలాసార్లు బహిరంగంగానే మాట్లాడుతుంది. అంతేకాదు ఏవిషయంపైనైనా బోల్డ్ కామెంట్స్ చేయడానికి వెనుకడగు వేయదు. కుండబద్దలు కొట్టేలా మాట్లాడగలదు. ఇప్పుడు మరో బోల్డ్ స్టేట్ మెంట్ తో వార్తల్లోకి ఎక్కింది. శృతి హాసన్ ప్రకారం.. చాలా మంది హీరోలకు కొత్తగా ప్రయత్నించే ధైర్యం ఉండదని చెప్పేసింది.
“చాలా మంది నటీనటులు కొత్త మార్గాల్లో అడుగుపెట్టాలని కోరుకుంటారు. కానీ చేసే ధైర్యం లేక అవకాశాలు లేకపోవటం వల్ల అలా చేయలేకపోతున్నారు. కానీ ఇక్కడే మా నాన్న కమల్ హాసన్ ప్రత్యేకంగా నిలుస్తారు. ఆయన కథల ఎంపిక ఇతర నటీనటులకు భిన్నంగా ఉంటుంది. అతని ధైర్యం మిగతా వారి నుండి వేరు చేస్తుంది” అని శృతి చెప్పింది. ఈ మేరకు శృతి హాసన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ చర్చలో ఆమె తన తల్లి సారిక కెరీర్‌ను కూడా ప్రతిబింబించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో తన తల్లి ఉంటే తన కెరీర్ మరోలా ఉండేదని ఆమె అభిప్రాయపడింది. శృతి తన తల్లిని చాలా ధైర్యవంతురాలిగా అభివర్ణించింది. తన కెరీర్ విషయానికొస్తే, సంగీతం, సినిమాలు రెండింటినీ కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె అడివి శేష్ సరసన “డెకాయిట్” అనే చిత్రంలో నటిస్తోంది. అదనంగా, “చెన్నై స్టోరీ” మరియు “సాలర్ పార్ట్-2” వంటి ప్రాజెక్ట్‌ల్లో కూడా నటించబోతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ వైరల్ గా మారాయి.
అయితే ఆ మధ్య వేగం తగ్గించినా శృతి గత ఏడాది వరుస హిట్స్ దూసుకుపోయింది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, సలార్ సినిమాలతో వరుస హిట్స్ ను అందుకుంది. ఒక్క పక్క కుర్ర హీరోల పక్కన నటిస్తూనే, మరోవైపు సీనియర్ హీరోలతో ఆడిపాడుతోంది. అందుకే ఈ బ్యూటీ అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో గబ్బర్ సింగ్ తో మొదటి హిట్ ను అందుకున్న ఈ బ్యూటీ గొల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. ఇక కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు.
— shruti haasan (@shrutihaasan) February 6, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.