లాక్‌డౌన్ ఎఫెక్ట్.. శాశ్వతంగా మూతపడబోతున్న ప్రముఖ థియేటర్..!

| Edited By:

Jun 12, 2020 | 1:11 PM

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలపై పడింది. అందులో ఎంటర్‌టైన్‌మెంట్ రంగం కూడా ఉంది.

లాక్‌డౌన్ ఎఫెక్ట్.. శాశ్వతంగా మూతపడబోతున్న ప్రముఖ థియేటర్..!
Follow us on

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలపై పడింది. అందులో ఎంటర్‌టైన్‌మెంట్ రంగం కూడా ఉంది. షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో పాటు మరో మూడు నెలల పాటు థియేటర్లు తెరిచే అవకాశం లేదన్న వార్తల నేపథ్యంలో థియేటర్ యజమానులు ఆలోచనలో పడ్డారు. మరోవైపు ఆన్‌లైన్ రిలీజ్‌కు క్రేజ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో నష్టాన్ని పూడ్చుకోవడం కష్టమని భావిస్తోన్న యజమానులు, థియేటర్లను మూసేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ ప్రముఖ థియేటర్‌ను శాశ్వతంగా మూతపడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

చెన్నైలోని వడపలని ఏరియాలో ఉన్న ప్రముఖ ఏవీఎం రాజేశ్వరి థియేటర్‌ని మూసివేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాధరణ ప్రేక్షకులకు అందుబాటులో టికెట్‌ ధరలను పెడుతూ.. సినీ అభిమానులకు ఫ్రెండ్లీగా ఉన్న ఈ థియేటర్‌ని శాశ్వతంగా మూసివేయాలన్న ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. చెన్నైలో సినిమాలు వీక్షించే సాధారణ ప్రేక్షకులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్‌నే. కాగా అదే నగరంలో ఉన్న మరో ప్రముఖ థియేటర్ మహారాణి కూడా శాశ్వతంగా మూతపడబోతున్టనట్లు టాక్‌.

Read This Story Also: ఉద్యోగులకు షాక్.. ప్రైవేట్ కంపెనీలకు భారీ ఊరట..!