నలుగురు టాప్ హీరోలతో శంకర్ మూవీ.. ఆ ఇద్దరు కన్ఫర్మ్..!
స్టార్ దర్శకుడు శంకర్ మరో ప్రయోగం చేయబోతున్నారా..? అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి కోలీవుడ్‌లో.
Shankar multi starrer movie: స్టార్ దర్శకుడు శంకర్ మరో ప్రయోగం చేయబోతున్నారా..? అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి కోలీవుడ్‌లో. దక్షిణాది భాషల్లోని నలుగురు హీరోలతో ఒక మెగా మల్టీస్టారర్ మూవీని తీసేందుకు ఆయన రెడీ అవుతున్నట్లు సమాచారం. తమిళ సినిమా వర్గాల ప్రకారం.. ప్రస్తుతం కమల్ హాసన్‌తో ఇండియన్ 2ను తెరకెక్కిస్తోన్న శంకర్.. ఇటీవల ఓ స్క్రిప్ట్‌ను తయారు చేశారట. ( వరలక్ష్మి హత్య కేసు.. వెలుగులోకి కీలక విషయాలు)
ఇక నలుగురు హీరోల్లో భాగంగా కన్నడ నుంచి యశ్, తమిళ్ నుంచి విజయ్ సేతుపతితో శంకర్ సంప్రదింపులు జరిపి ఓకే చేసుకున్నారట. ఇక తెలుగులో ఒకరిని, మలయాళంలో మరొకరిని తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. అంతేకాదు ఈ మూవీని రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించబోతున్నట్లు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే నిజంగానే దక్షిణాది సినిమా ఇండస్ట్రీలోనే ఇది క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. ( బట్టతల దాచి పెళ్లి చేసుకున్నాడు.. పోలీసులకు భార్య ఫిర్యాదు)