Kajal Wedding: కాజల్‌, గౌతమ్‌లకు అనుష్క స్పెషల్ విషెస్‌

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌ శ్రీమతిగా మారారు. తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుతో ఈ నెల 30న మూడు ముళ్లు వేయించుకొని మరో ఇన్నింగ్స్‌ని ప్రారంభించారు

Kajal Wedding: కాజల్‌, గౌతమ్‌లకు అనుష్క స్పెషల్ విషెస్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 01, 2020 | 3:06 PM

Kajal Aggarwal Wedding: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌ శ్రీమతిగా మారారు. తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుతో ఈ నెల 30న మూడు ముళ్లు వేయించుకొని మరో ఇన్నింగ్స్‌ని ప్రారంభించారు. ఇక కాజల్ పెళ్లి సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియాలో విషెస్ తెలిపారు. ఈ నేపథ్యంలో దేవసేన అనుష్క కాజల్‌, గౌతమ్‌లకు స్పెషల్ విషెస్ చెప్పారు. (నలుగురు టాప్ హీరోలతో శంకర్ మూవీ.. ఆ ఇద్దరు కన్ఫర్మ్‌..!)

వివాహంలోని సంతోషమే ప్రపంచంలో అత్యుత్తమ సంతోషం. రెండు ఆత్మలు-ఒకే ఆలోచన, రెండు గుండెలు- ఒకటే గుండెచప్పుడు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్‌ టు కాజల్‌& గౌతమ్. మీ ఇద్దరికి కంగ్రాట్స్ అని అనుష్క ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా వారి ఫొటోను కూడా ఆమె షేర్ చేశారు. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో కాజల్‌ వివాహం సింపుల్‌గా జరగ్గా.. టాలీవుడ్‌ ప్రముఖులకు ఆమె ఓ పార్టీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ( వరలక్ష్మి హత్య కేసు.. వెలుగులోకి కీలక విషయాలు)