AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవును నాకు కరోనా సోకింది: బుల్లితెర నటుడు‌‌ రవికృష్ణ

తెలుగు సీరియల్స్ రంగంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఇటీవల సీరియళ్ల షూటింగ్‌లను ప్రారంభించగా..

అవును నాకు  కరోనా సోకింది: బుల్లితెర నటుడు‌‌ రవికృష్ణ
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 04, 2020 | 10:09 AM

Share

తెలుగు సీరియల్స్ రంగంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఇటీవల సీరియళ్ల షూటింగ్‌లను ప్రారంభించగా.. అందులో పాల్గొంటున్న వారు ఒక్కొక్కరుగా వైరస్‌ బారిన పడుతున్నారు. ఇప్పటికే ఓ ఐదారు మంది పేరు మోసిన బుల్లితెర నటులకు కరోనా సోకగా.. తాజాగా ‘ఆమె కథ’, ‘వరూధిని పరిణయం’ ఫేమ్, ‘బిగ్‌బాస్‌ 3’ కంటెస్టెంట్‌ రవికృష్ణకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు.

”నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మూడు రోజులుగా నేను ఐసోలేషన్‌లో ఉంటున్నాను. దేవుడి దయ, మీ ఆశీస్సుల వలన ప్రస్తుతం నాకు ఎలాంటి లక్షణాలు లేవు. ఈ వైరస్‌ ఎక్కడి నుంచి నాకు సోకిందన్న దానిపై నేనేం బాధపడటం లేదు. అయితే నాతో కాంటాక్ట్‌ అయిన వారందరూ పరీక్షలు చేయించుకొని, ఐసోలేషన్‌లో ఉండమని మాత్రం నేను కోరుతున్నా. అలాగే వైరస్ సోకిన వారి పట్ల అమానవీయంగా ప్రవర్తించకండని కోరుతున్నా. నెగిటివిటీకి దూరంగా ఉండి, త్వరగా నేను కోలుకోవాలని ఆశిస్తున్నా” అని రవికృష్ణ తెలిపారు. కాగా ఆమె కథలో రవికృష్ణ సరసన నటించే ‘నవ్య స్వామి’కి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.

Follow Us
వట పౌర్ణమి జూన్ 29నా? 30నా? సరైన తేదీ ఇదే.. వ్రత విశిష్టత, పూజా..
వట పౌర్ణమి జూన్ 29నా? 30నా? సరైన తేదీ ఇదే.. వ్రత విశిష్టత, పూజా..
తెలుగు రాష్ట్రాలకు కరువు ముప్పు.. డెడ్ స్టోరేజ్‌కు చేరిన ప్రాజెక్
తెలుగు రాష్ట్రాలకు కరువు ముప్పు.. డెడ్ స్టోరేజ్‌కు చేరిన ప్రాజెక్
గ్యాస్ స్టవ్ పక్కనే వంట నూనె పెడుతున్నారా? నిపుణుల హెచ్చరిక!
గ్యాస్ స్టవ్ పక్కనే వంట నూనె పెడుతున్నారా? నిపుణుల హెచ్చరిక!
శనివారాల్లో నూనె స్నానం చేస్తే ఏమవుతుంది? శని అనుగ్రహంతో పాటు..
శనివారాల్లో నూనె స్నానం చేస్తే ఏమవుతుంది? శని అనుగ్రహంతో పాటు..
ఇలాంటి బంగాళాదుంపలు తింటున్నారా..? మీ ఆరోగ్యం బంగాళాఖాతమే..!
ఇలాంటి బంగాళాదుంపలు తింటున్నారా..? మీ ఆరోగ్యం బంగాళాఖాతమే..!
కేవలం రూ.50 వేలతోనే అద్భుతమైన వ్యాపారం.. లక్షల్లో ఆదాయం..!
కేవలం రూ.50 వేలతోనే అద్భుతమైన వ్యాపారం.. లక్షల్లో ఆదాయం..!
బిగ్ షాక్.. చిత్తుగా ఓడిన టీమిండియా!
బిగ్ షాక్.. చిత్తుగా ఓడిన టీమిండియా!
రోజూ బ్లూబెర్రీస్ తింటే శరీరంలో జరిగేది ఇదే? సైన్స్ చెబుతున్న మాట
రోజూ బ్లూబెర్రీస్ తింటే శరీరంలో జరిగేది ఇదే? సైన్స్ చెబుతున్న మాట
డ్రగ్స్‌పై సైబరాబాద్ పోలీసుల కఠిన ఆదేశాలు..
డ్రగ్స్‌పై సైబరాబాద్ పోలీసుల కఠిన ఆదేశాలు..
శని త్రయోదశి రేపే.. ఈ ఒక్క రోజు ఇలా పూజిస్తే శని దోషాలు తొలగి..
శని త్రయోదశి రేపే.. ఈ ఒక్క రోజు ఇలా పూజిస్తే శని దోషాలు తొలగి..