వర్మ టార్గెట్‌గా వల్లభనేని వంశీ.. మరో వివాదానికి.. సీక్వెల్ షురూ..!

మండుతోన్న పొయ్యి మీద.. ఇంకా పెట్రోల్‌ పోసి ఆజ్యం పోసినట్టు.. ఇప్పటికే.. ‘కమ్మ రాజ్యంలో.. కడప రెడ్లు’ సినిమాతో వివాదాలు మూటగట్టుకున్న వర్మ.. ఇప్పుడు మరొక వివాదానికి తెరలేపారు. ఇప్పటికే.. ఈ చిత్రంలో.. పలు రకాల.. సన్నివేశాలను.. పాటలను విడుదల చేసి హల్‌చల్ సృష్టించాడు రాంగోపాల్ వర్మ. ఇప్పుడు మళ్లీ.. ఇంకో సినిమా వివరాలు ప్రకటించి.. ‘వార్నీ’ అనిపిస్తున్నాడు. ‘కమ్మ రాజ్యంలో.. కడప రెడ్లు’ సినిమా ఇంకా విడుదల దశలో ఉండగానే.. దానికి సీక్వెల్‌గా మరో సినిమాను […]

  • Updated On - 3:35 pm, Sat, 16 November 19 Edited By: Srinu Perla
వర్మ టార్గెట్‌గా వల్లభనేని వంశీ.. మరో వివాదానికి.. సీక్వెల్ షురూ..!

మండుతోన్న పొయ్యి మీద.. ఇంకా పెట్రోల్‌ పోసి ఆజ్యం పోసినట్టు.. ఇప్పటికే.. ‘కమ్మ రాజ్యంలో.. కడప రెడ్లు’ సినిమాతో వివాదాలు మూటగట్టుకున్న వర్మ.. ఇప్పుడు మరొక వివాదానికి తెరలేపారు. ఇప్పటికే.. ఈ చిత్రంలో.. పలు రకాల.. సన్నివేశాలను.. పాటలను విడుదల చేసి హల్‌చల్ సృష్టించాడు రాంగోపాల్ వర్మ. ఇప్పుడు మళ్లీ.. ఇంకో సినిమా వివరాలు ప్రకటించి.. ‘వార్నీ’ అనిపిస్తున్నాడు. ‘కమ్మ రాజ్యంలో.. కడప రెడ్లు’ సినిమా ఇంకా విడుదల దశలో ఉండగానే.. దానికి సీక్వెల్‌గా మరో సినిమాను ప్రకటించారు. అదే.. ‘రెడ్డి రాజ్యానికి.. కమ్మ ఫ్యాన్స్’. అంతేకాదు.. దానికో లెక్క కూడా చెప్పుకొచ్చాడు మన వర్మ.

‘వల్లభనేని వంశీ ఇంటర్వ్యూ చూశాక.. నాకు.. ‘కమ్మ రాజ్యంలో.. కడప రెడ్లు’ సినిమాకి సీక్వెల్ తీయాలనే ఆలోచన వచ్చింది. వల్లభనేని వంశీ ఫైరింగ్ కామెంట్స్‌నే తనకు ఈ ఐడియా వచ్చేలా చేసిందని’.. ట్వీట్‌లో పేర్కొన్నాడు వర్మ. మొత్తానికి ఏదైనా.. ఇప్పుడు వర్మ.. వల్లభనేని వంశీని టార్గెట్‌గా ఇంకో కొత్త సినిమాకి బాగానే వాడుతున్నాడు. వేచి చూడాలి ఏమౌతుందో..! కాగా.. ‘కమ్మ రాజ్యంలో.. కడప రెడ్లు’ సినిమా ఈ నెల 29న విడుదల చేస్తున్నట్టుగా.. రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.