Ramgopal Varma: నిత్యం వార్తల్లో నిలవడం రామ్‌గోపాల్ వర్మకు వెన్నతో పెట్టిన విద్య. ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేయడం వర్మకు మాత్రమే దక్కుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సినిమాలను అత్యంత వేగంగా తీయడంలో కూడా వర్మకు ఎవరూ సాటిరారు. సినిమా ప్రకటించిన ఆరు నెలల్లోపే థియేటర్లకు తెస్తుంటాడు. ఇక ఒకప్పుడు హర్రర్ మూవీస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా పేరు తెచ్చుకున్న వర్మ ఆ తర్వాత మాత్రం క్రమంగా హర్రర్ మూవీస్‌ని తగ్గించి యాక్షన్, రొమాంటిక్ మూవీస్‌పై పడ్డారు. అయితే తాజాగా మరోసారి ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైన ఆర్జీవీ.. ఈసారి తన సొంత కథతో కాకుండా రచయిత యండమూరి విరేంద్ర నాథ్ కథతో రానున్నారు.
ఇందులో భాగంగానే ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ రచయితగా వ్యవహరించిన ‘తులసీ దళం’ నవల కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. తులసీ దళం కథకు సీక్వెల్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు వర్మ.. ‘తులసి తీర్థం’ అని టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ క్రమంలోనే ఫస్ట్ లుక్ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ రేర్ కాంబినేషన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.
Yandamuri Veerendranath’s novel “Tulasi Dalam” has been one of the most influential novels I ever read,and now i am very excited to make its sequel “Tulasi Theerdham” ..It is produced by Rama Satyanarayana of Bheemavaram Talkies . Click for details https://t.co/aR0ZFgHcx2 pic.twitter.com/OWbvFhgR0w
— Ram Gopal Varma (@RGVzoomin) November 25, 2021
ఇదిలా ఉంటే పోస్టర్‌ను విడుదల చేస్తున్న సందర్భంగా దిగిన ఫోటోను ట్వీట్ చేసిన వర్మ.. ‘నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన నవలల్లో యండమూరి వీరేంద్రనాథ్ రాసిన తులసీ దళం ఒకటి. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా తులసి తీర్థం తీర్థం తెరకెక్కిస్తుండడం నాకెంతో ఎగ్జైట్‌మెంట్‌గా ఉంది’ అంటూ పోస్ట్ చేశారు. మరి మరో సారి భయపెట్టేందుకు వస్తున్న వర్మ ఏమేర ఆకట్టుకుంటారో చూడాలి.
Also Read: Coal Mine Accident: సైబీరియా బొగ్గు గనిలో ఘోర ప్రమాదం.. 11మంది మృతి, పదుల సంఖ్యలో గల్లంతు!
Nitin Gadkari: EV విప్లవం దగ్గరలోనే ఉంది.. రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయి..