AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా మనసు మరోసారి విరిగిపోయింది: ‘దిల్‌ బేచారా’పై కృతి

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ నటించిన చివరి చిత్రం దిల్‌ బేచారా రెండు రోజుల క్రితం హాట్‌స్టార్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

నా మనసు మరోసారి విరిగిపోయింది: 'దిల్‌ బేచారా'పై కృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 26, 2020 | 4:13 PM

Share

Kriti Sanon on Sushant’s Dil Bechara movie: సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ నటించిన చివరి చిత్రం దిల్‌ బేచారా రెండు రోజుల క్రితం హాట్‌స్టార్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీని చూసిన అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. సినిమాలోనూ సుశాంత్‌ చనిపోయే సన్నివేశం ఉండటంతో వారి బాధ మరింత ఎక్కువవుతోంది. మరోవైపు సినీ ప్రముఖులు సైతం సినిమా చూస్తున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నామని, సుశాంత్‌ను మిస్ అవుతున్నామని కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్‌ సహనటి, మాజీ లవర్‌ కృతి సనన్, ‘దిల్‌ బేచారా’పై సోషల్ మీడియాలో స్పందించారు.

”ఇది ఏ మాత్రం సమ్మతం కాదు. నా మనసు మరోసారి విరిగిపోయింది. మ్యానీ పాత్రలో పలు సన్నివేశాల్లో నువ్వు బ్రతికి వచ్చినట్లు నాకు అనిపించింది. ఏ పాత్రలో నువ్వు ఎక్కడ నీలాగా ఫీల్‌ అవుతావో నాకు తెలుసు. కొన్ని సన్నివేశాల్లో నువ్వు మౌనంగా ఉన్నప్పటికి ఎన్నో విషయాలను చెబుతావు. ముఖేష్ చాబ్రా.. నువ్వు ఆలోచించిన దాని కంటే నీకు ఈ సినిమా ఎంత స్పెషల్ అన్నది నాకు తెలుసు. నీ మొదటి సినిమాతోనే మమ్మల్ని చాలా భావోద్వేగాలకు గురయ్యేలా చేశావు. సంజనా సంఘి నీకు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నా” అని కామెంట్ పెట్టారు. ఈ సందర్భంగా సుశాంత్‌కి సంబంధించిన ఓ వీడియోను కృతి సనన్ పోస్ట్ చేశారు.

Read This Story Also: కేసు పెట్టిన ఇద్దరు భార్యలు.. తలపట్టుకున్న భర్త

https://www.instagram.com/p/CDGGsKggXs8/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again