సత్యదేవ్‌కి క్రేజీ ఆఫర్‌.. తమిళ్‌లోకి ఎంట్రీ!

టాలీవుడ్‌లో ఉన్న విలక్షణ నటుల్లో సత్యదేవ్‌ ఒకరు. తాను నటించిన ప్రతి పాత్రలోనూ ఒదిగిపోయిన ఈ నటుడు

సత్యదేవ్‌కి క్రేజీ ఆఫర్‌.. తమిళ్‌లోకి ఎంట్రీ!
TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 01, 2020 | 2:20 PM

Satyadev Tamil entry: టాలీవుడ్‌లో ఉన్న విలక్షణ నటుల్లో సత్యదేవ్‌ ఒకరు. తాను నటించిన ప్రతి పాత్రలోనూ ఒదిగిపోయిన ఈ నటుడు ఇటీవల ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక తాజాగా సత్యదేవ్‌కి మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. సత్యదేవ్‌కి తమిళ సినిమాలో అవకాశం వచ్చినట్లు సమాచారం.

కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో అరుణ్ మాతేశ్వరన్ అనే కొత్త దర్శకుడు సానీ కాయితమ్ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ద్వారా సంచలన దర్శకుడు సెల్వ రాఘవన్‌ నటుడిగా పరిచయం అవుతున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ కూడా ఆ మధ్యన విడుదలైంది. ఇక ఇందులో ఓ పాత్ర కోసం మేకర్లు సత్యదేవ్‌ని సంప్రదించారట. పాత్ర నచ్చడంతో ఈ నటుడు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు సమాచారం.

కాగా 80ల్లో జరిగిన ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మించబోతున్న ఈ మూవీని తమిళ్‌తో పాటు తెలుగులోనూ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సత్యదేవ్ ప్రస్తుతం గుర్తుందా సీతాకాలంలో నటిస్తున్నారు. కన్నడలో విజయం సాధించిన లవ్ మాక్‌టైల్‌ రీమేక్‌గా తెరకెక్కబోతున్న ఈ మూవీలో సత్యదేవ్ సరసన తమన్నా నటించనుంది.

Read More:

‘పుష్ప’కు హైలెట్‌గా రాక్‌స్టార్ మ్యూజిక్‌

ఆ రీమేక్‌పై ఆసక్తిగా ఉన్న మాటల మాంత్రికుడు!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu