‘సరిలేరు నీకెవ్వరు’ రెండో సింగిల్.. ప్రత్యేకలివే..!
సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లను ప్రారంభించిన చిత్ర యూనిట్.. ఐదు సోమవారాలు, ఐదు పాటలను విడుదలను చేయనున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా గత సోమవారం ‘మైండ్ బ్లాక్’ సాంగ్ వచ్చేసింది. మాస్ బీట్‌తో వచ్చిన ఈ పాటకు ఆడియెన్స్ నుంచి మిక్స్‌డ్ రియాక్షన్స్ వచ్చాయి. కొందరేమో పాట అదిరిపోయిందని.. మరికొందరేమో దేవీ శ్రీ ప్రసాద్ […]

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లను ప్రారంభించిన చిత్ర యూనిట్.. ఐదు సోమవారాలు, ఐదు పాటలను విడుదలను చేయనున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా గత సోమవారం ‘మైండ్ బ్లాక్’ సాంగ్ వచ్చేసింది. మాస్ బీట్‌తో వచ్చిన ఈ పాటకు ఆడియెన్స్ నుంచి మిక్స్‌డ్ రియాక్షన్స్ వచ్చాయి. కొందరేమో పాట అదిరిపోయిందని.. మరికొందరేమో దేవీ శ్రీ ప్రసాద్ తన పాటలను తానే రిపీట్ చేస్తున్నాడని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే ఆ కామెంట్లను చిత్ర యూనిట్ పెద్దగా పట్టించుకోలేదు. థియేటర్లలో ఈ పాటకు కచ్చితంగా ఆడియెన్స్ నుంచి విజిల్స్ వస్తాయని దర్శకనిర్మాతలు అంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి ఈ సోమవారం రెండో పాట రాబోతోంది. ‘సూర్యుడివో చంద్రుడివో’ అనే మెలోడీ సాంగ్‌ను చిత్ర యూనిట్ 9వ తేదిన సాయంత్రం గం5.04ని.లకు రిలీజ్ చేయబోతున్నారు. ఈ పాటను ప్రముఖ పంజాబీ సింగర్ బి ప్రాక్ ఆలపించగా.. రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. కాగా ఇటీవల బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ నటించిన ‘ఫిల్హాల్’ అనే ఆల్బమ్ పాటను ప్రాక్ పాడిన విషయం తెలిసిందే. ఇది పెద్ద హిట్ అవ్వడంతో.. ఇప్పుడు మహేష్ పాటపై కూడా అంచనాలు మొదలయ్యాయి. మరోవైపు ఇదే పాటతో సౌత్ ఇండస్ట్రీలోకి ప్రాక్ ఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం.
“సూర్యుడివో చంద్రుడివో”?? @ThisIsDSP sirrr thank you for the soothing tunes and @ramjowrites gaaru your lyrics brought life to this song ❤ This song Going to be DSP’s one of the BEST ?
2nd lyrical #SuryudivoChandrudivo will be live on tomorrow @ 5:04 PM pic.twitter.com/3S6BqPh9bK
— Anil Ravipudi (@AnilRavipudi) December 8, 2019
కాగా ఇప్పటివరకు ఎంతో మంది ఉత్తారాది గాయకులను దేవీ శ్రీ టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. అద్నాన్ సమీ, నేహా బాసిన్, మమతా శర్మ, ఫర్హాన్ అక్తర్ వంటి గాయకులకు తెలుగులో తీసుకొచ్చిన దేవీ.. వారి వద్ద నుంచి తెలుగు పలుకులను రప్పించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’లో మొదటి పాట సరిగా ఆకట్టుకోకపోవడంతో.. రెండో పాటపై మహేష్ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. మరి వారి అంచనాలను ప్రాక్‌తో కలిసి దేవీ ఏ మేరకు అందుకుంటాడో తెలియాలంటే కొన్ని గంటలు వేచి ఉండాల్సిందే.
Glad 2 Share dat Dear @BPraak who Rocked INDIA wit his latest Song #FILHALL wit @akshaykumar sir.. Has Sung his 1st Song 4 SOUTH in #SLN#SuryudivoChandrudivo & Rocked it with his SOULFUL VOICE❤️
Am sure U r all gona fall in lov wit his Vocals & @ramjowrites lyrics ❤️
Tomorow? pic.twitter.com/1WA9qZF9XZ
— DEVI SRI PRASAD (@ThisIsDSP) December 8, 2019
అయితే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో నటించాడు. ఆయన సరసన రష్మిక నటించగా.. విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, వెన్నెల కిశోర్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీలోని మైండ్ బ్లాక్ సాంగ్ షూటింగ్ ఫిలింసిటీలో జరుగుతోంది. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా మెరవనుంది.



