Samuthirakani : పవర్ స్టార్ సినిమాలో బన్నీ విలన్.. క్రేజీ ఆఫర్ దక్కించుకున్న సముద్రఖని

బాలీవుడ్ నటుడు సముద్రఖని ఇటీవల తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. అల వైకుంఠపురంలో సముద్రఖని తన నటనతో

Samuthirakani : పవర్ స్టార్ సినిమాలో బన్నీ విలన్.. క్రేజీ ఆఫర్ దక్కించుకున్న సముద్రఖని

Updated on: Jan 15, 2021 | 4:08 PM

samuthirakani : బాలీవుడ్ నటుడు సముద్రఖని ఇటీవల తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. ‘అల వైకుంఠపురంలో’ సముద్రఖని తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఇటీవల విడుదలైన’ క్రాక్’ సినిమాలో తనదని నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నారు సముద్రఖని. తాజాగా ఈ విలక్షణ నటుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం దక్కించుకున్నారని తెల్సుతుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో సముద్రఖని కీలక పాత్రలో నటించనున్నారని తెల్సుతుంది. మలయాళం లో సూపర్ హిట్ అయిన `అయ్యప్పనమ్ కోషియం` రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. సాగ‌ర్ చంద్ర డైరెక్ట్ చేస్తుండ‌గా..త్రివిక్ర‌మ్ ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లు చూస్తున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ సినిమాలో కీలక పాత్ర చేయాలని త్రివిక్రమ్ ఫోన్ చేసి సముద్రఖనిని అడిగారట. ఈ సినిమాలో తన పాత్ర గురించి తనకు పెద్దగా తెలియదని త్రివిక్రమ్ ఫోన్ చేసి.. తన కోసం మంచి పాత్రను డిజైన్ చేశానని చెప్పారని సముద్రఖని వెల్లడించారు. అయితే ఈ సినిమాలో రానా తండ్రిగా సముద్రఖని కనిపించనున్నారని ఫిలిం నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Lokesh Kanagaraj : ‘మాస్టర్’ రిజల్ట్.. లోకేష్ కానగరాజ్‌‌‌‌‌‌‌తో మెగా పవర్ స్టార్ సినిమా ఉన్నట్టా.? లేనట్టా.?

Chiru Nag Sankranti Celebrations:కొణిదెలవారింట వైభవంగా సంక్రాంతి సంబరాలు.ఈసారి కొత్తఅల్లుడే కాదు..అనుకోని అతిథి కూడా