Cauliflower Teaser: మగాడి శీల రక్షణ కోసం చట్టం కావాలంటున్న సంపు.. నవ్వులు పూయిస్తోన్న ‘క్యాలీ ఫ్లవర్‌’ టీజర్‌..

‘హృదయ కాలేయం’, 'సింగం 123', 'కొబ్బరి మట్ట', 'బజార్‌ రౌడీ' వంటి చిత్రాలతో సోలో హీరోగా మెప్పించాడు

Cauliflower Teaser: మగాడి శీల రక్షణ కోసం చట్టం కావాలంటున్న సంపు.. నవ్వులు పూయిస్తోన్న క్యాలీ ఫ్లవర్‌’  టీజర్‌..

Updated on: Nov 17, 2021 | 7:19 PM

‘హృదయ కాలేయం’, ‘సింగం 123’, ‘కొబ్బరి మట్ట’, ‘బజార్‌ రౌడీ’ వంటి చిత్రాలతో సోలో హీరోగా మెప్పించాడు సంపూర్ణేష్‌ బాబు. బర్నింగ్‌ స్టార్‌గా ప్రేక్షకుల అభిమానం సంపాదించాడు. త్వరలోనే ఆయన ‘క్యాలీ ఫ్లవర్‌’ అనే స‌రికొత్త సినిమాతో మ‌న‌ముందుకు రానున్నారు. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈనెల 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం తాజాగా సినిమా టీజర్‌ను విడుదల చేసింది.

నా ఘోష ప్రపంచానికి తెలియాలి..
టీజర్‌లో భాగంగా ‘ఆకాశవాణి ..కెమెరా పెట్టు.. నా ఘోష ఏంటోఈ ప్రపంచానికి తెలియాలి’.. ‘ఎనీ టైమ్ శీలాన్ని కాపాడే సింబలేరా ఈ క్యాలీఫ్లవర్‌.. చరిత్రలో ఏ మగాడికి జరగకూడని అన్యాయం నాకు జరిగింది. మగాడి శీల రక్షణ కోసం చట్టం తీసుకురావడమే నా పోరాటం’ అంటూ సంపూ చెప్పే డైలాగులు సినిమా ప్రియుల చేత నవ్వులు కురిపిస్తున్నాయి. మరి సంపూ ఘోషేంటో తెలుసుకోవాలంటే ఈనెల 26వరకు ఆగాల్సిందే. అప్పటివరకు ఈ టీజర్‌ను చూసి నవ్వుకోండి.Also Read:

Vishwanathan Anand: వెండితెరపైకి విశ్వనాథ్ ఆనంద్ బయోపిక్.. తన పాత్రలో ఆ హీరో నటించాలంటూ..

Agent: స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. మేజర్ షెడ్యూల్ పూర్తి చేసిన ఏజెంట్..

Spider Man No Way Home: నలుగురు విలన్లతో.. ‘స్పైడర్ మాన్’ భీకర యుద్ధం.. కథలో అద్భుత ట్విస్ట్.!