Samantha: సమంత, నాగచైతన్య విడాకుల వ్యవహారం అనంతరం పలు యూట్యూబ్ చానళ్లు ఆమె ప్రతిష్టతను దెబ్బ తీసేలా కొన్ని కథనాలు చేశాయంటూ నటి సమంత కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోమవారం కూకట్ పల్లి కోర్టు సమంత తరఫు న్యాయవాది బాలాజీ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన.. సమంత, నాగచైతన్యకు విడాకులు మంజూరు కాకముందే వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం సబబు కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
సమంత గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రసారాలు చేసిన మూడు యూట్యూబ్ ఛానల్స్‌పై చర్యలు తీసుకోవాలని కోర్టుకు తెలిపినట్లు బాలాజీ మీడియాకు తెలిపారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తిపై ఇలాంటి తప్పుడు కథనాలను ప్రసారం చేయడం సరైందని కాదని తెలిపిన న్యాయవాది.. తమ పిటీషన్‌లో ఎక్కడ కూడా సమంత డబ్బులు అడగలేదని తేల్చి చెప్పారు. కేవలం సదరు వీడియోలకు సంబంధించిన లింకులను మాత్రమే తొలగించాలని కోరామని బాలాజీ క్లారిటీ ఇచ్చారు.
ఇక భవిష్యత్తులో ఇలాంటి వార్తలు మరోసారి ప్రసారం చేయకుండా.. పర్మినెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరినట్లు చెప్పుకొచ్చారు. గతంలో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి విషయంలోనూ ముంబై హైకోర్టు ఇదే తరహాలో ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందన్నారు. ఈ రోజుతో వాదనలు పూర్తి చేసిన కూకట్‌పల్లి న్యాయస్థానం తీర్పును రేపటికి (అక్టోబర్ 26కి) రిజర్వ్ చేసిందని సమంత తరపు న్యాయవాది బాలాజీ తెలిపారు.
Mani Sharma Son Marriage: అట్టహాసంగా సింగర్‌ను వివాహమాడిన మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్