సాయి పల్లవిని బెదిరిస్తోన్న సమంత..!

యంగ్ హీరోయిన్ సాయి పల్లవిని అక్కినేని కోడలు సమంత బెదిరిస్తోంది. అయినా ఆమె బెదిరింపులో కూడా ఓ అర్థం ఉందండోయ్. ఎందుకంటే తన భర్త జోలికి వస్తే ఏ మహిళ ఊరుకుంటుంది మరి. ఇప్పుడు సమంత కూడా అదే చేస్తోంది. అయితే ఆ బెదిరింపును సీరియస్‌గా చెప్పకపోయినా.. ఓ మీమ్ రూపంలో తన ఫీలింగ్‌ను బయటపెట్టేసింది సమంత. అసలు విషయంలోకొస్తే నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. […]

సాయి పల్లవిని బెదిరిస్తోన్న సమంత..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 15, 2020 | 12:52 PM

యంగ్ హీరోయిన్ సాయి పల్లవిని అక్కినేని కోడలు సమంత బెదిరిస్తోంది. అయినా ఆమె బెదిరింపులో కూడా ఓ అర్థం ఉందండోయ్. ఎందుకంటే తన భర్త జోలికి వస్తే ఏ మహిళ ఊరుకుంటుంది మరి. ఇప్పుడు సమంత కూడా అదే చేస్తోంది. అయితే ఆ బెదిరింపును సీరియస్‌గా చెప్పకపోయినా.. ఓ మీమ్ రూపంలో తన ఫీలింగ్‌ను బయటపెట్టేసింది సమంత.

అసలు విషయంలోకొస్తే నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ మంగళవారం విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో సాయి పల్లవి, చైతూ చొక్కా పట్టుకొని లాగి తన దగ్గరకు తీసుకున్నట్లుగా భావోద్వేగంతో ఉంది. ఇక ఈ పోస్టర్‌ను అందరినీ ఆకట్టుకోగా.. దీన్ని సమంత సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అయితే ఈ పోస్టర్‌పై చాలా మీమ్స్ వచ్చాయి. ముఖ్యంగా ఈ పోస్టర్‌పై సమంత ఫీలింగ్ ఇదేనంటూ చాలా సరదా మీమ్‌లు వచ్చాయి. వాటిలో ఓ మీమ్‌ను సమంత సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అందులో వదులు షర్ట్ వదులు అంటూ సమంత, సాయి పల్లవిని బెదిరిస్తున్నట్లుగా ఉంది. అంతేకాదు ఈ మీమ్‌కు అవును అంటూ ఓ జిఫ్‌ను కూడా సమంత పోస్ట్ చేశారు. ఇక ఈ సరదా పోస్ట్ కూడా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. కాగా లవ్‌స్టోరీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.