AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షారూక్ మూవీలో సల్మాన్ కీలక పాత్ర..!

బాలీవుడ్ ఖాన్లు షారూక్‌, సల్మాన్‌లు మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి పలు చిత్రాల్లో కూడా నటించారు.

షారూక్ మూవీలో సల్మాన్ కీలక పాత్ర..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 06, 2020 | 3:18 PM

Share

Shah Rukh Salman: బాలీవుడ్ ఖాన్లు షారూక్‌, సల్మాన్‌లు మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి పలు చిత్రాల్లో కూడా నటించారు. అంతేకాదు ఒకరి సినిమాల్లో మరొకరు అతిథి పాత్రలో కూడా నటించారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ ఇద్దరు మరోసారి స్క్రీన్‌పై కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ( బాలయ్య సినిమా నుంచి ఆ హీరోయిన్‌ని తీసేశారా..!)

రెండేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న షారూక్‌.. పఠాన్ అనే మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నారు. వార్‌, బ్యాంగ్ బ్యాంగ్ మూవీల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. యశ్‌రాజ్‌ ఫిలింస్ నిర్మించనుంది. ఇక ఇందులో దీపికా హీరోయిన్‌గా నటించనుండగా., జాన్ అబ్రహం విలన్‌గా కనిపించబోతున్నారు. కాగా ఈ మూవీలో ఓ కీలక పాత్రలో సల్మాన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సల్మాన్ 10 రోజుల పాటు డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు టాక్‌. కాగా ఈ మూవీతో పాటు రాజ్ కుమార్ హిరానీ, అట్లీ దర్శకత్వాల్లోనూ షారూక్ నటించనున్నట్లు తెలుస్తోంది. ( భర్తతో పాటు పూనమ్‌కి బెయిల్‌ మంజూరు)